టిడిపి అధినేత చంద్రబాబు మళ్లీ 2024లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తన శక్తికి మించి కష్టపడుతున్నారు.పార్టీ ఉత్సాహం నింపేందుకు, మునుపటిలా పార్టీ శ్రేణులను యాక్టివ్ చేసి వైసీపీ ప్రభుత్వం పై పెద్దఎత్తున పోరాటం చేయడంతో పాటు, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు తన వంతు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం తాను క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయడం, పార్టీ శ్రేణులను తరచుగా యాక్టివ్ అయ్యేలా చేస్తూ ఉండడం, ఏపీ వ్యాప్తంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇవన్నీ ఇబ్బంది తో కూడుకున్న వ్యవహారం కావడంతో, తన స్థానంలో లోకేష్ ను చంద్రబాబు యాక్టివ్ చేశారు.చంద్రబాబు సూచనలతో లోకేష్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
నిత్యం క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తూ హడావుడి చేస్తున్నారు.పోరాటాలు, పలకరింపులు, ఓదార్పులు అంటూ తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.అతి త్వరలోనే తెలుగుదేశం పార్టీ బాధ్యతలను పూర్తిగా లోకేష్ కు అప్పగించి, తాను రాజకీయం నడిపించాలని చంద్రబాబు ఎత్తుగడ వేస్తుండగా, టిడిపి సీనియర్ నాయకులతో పాటు, మెజారిటీ నాయకులు లోకేష్ నాయకత్వం పై 2024 ఎన్నికలకు వెళ్లేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు.లోకేష్ కు పూర్తి బాధ్యతలు అప్పగిస్తే జగన్ కు అవకాశం ఇచ్చినట్లే అని, సీనియర్లు అంతా అభిప్రాయపడుతున్నారు.
ఇదే విషయాలను ఇటీవల అసంతృప్తికి గురై, పార్టీకి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ హడావుడి చేసిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇటీవల చంద్రబాబు ను కలిశారు.దాదాపు 45 నిమిషాల పాటు ఆయన బాబు తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా పార్టీలో చోటుచేసుకుంటున్న పరిస్థితుల గురించి చంద్రబాబుకు బుచ్చయ్య వివరంగా చెప్పారట.ముఖ్యంగా లోకేష్ వ్యవహారాన్ని ఇప్పుడు పక్కన పెట్టాలని, ఆయన సారధ్యంలోనే 2024 ఎన్నికలకు వెళ్లాలని కానీ ఆయన ను ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించ వద్దని, అలా చేస్తే పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యం అంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారట.2024 టిడిపి సీఎం అభ్యర్థిగా మీరే ఉండాలని, అప్పుడే పార్టీ నాయకుల్లో ఉత్సాహం రావడంతో పాటు, అధికారం దక్కేందుకు అవకాశాలు ఉన్నాయంటూ బుచ్చయ్య సూటిగా చెప్పడం తో, చంద్రబాబు సైతం ఆయన మాటలతో ఏకీభవించారట.ప్రస్తుతం టిడిపి ఉన్న పరిస్థితుల్లో ప్రయోగాలు చేయడం సరికాదని, మీ తర్వాత ఎలాగూ లోకేష్ బాధ్యతలు స్వీకరిస్తారని, అప్పటి వరకు మీరే కీలకంగా వ్యవహరించాలంటూ బుచ్చయ్య చంద్రబాబుకు హితబోధ చేయడంతో ఆయన మాటలతో బాబు కూడా ఏకీభవించినట్టుగానే స్పందించరట.
.