మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి( Balineni Srinivas Reddy ) వ్యవహారం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.ఇటీవల ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వైసీపీలో ( YCP ) చర్చనీయాంశంగా మారుతున్నాయి.
పార్టీ పదవులకు రాజీనామా చేసి పూర్తిగా నియోజకవర్గానికి పరిమితమైన బాలినేని తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.తాను ఒంగోలు నియోజక వర్గం వదిలి… గిద్దలూరు, మార్కాపురం లలో పోటీ చేస్తున్నట్లు తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు.
ఒంగోలులోనే రాజకీయ జీవితం ప్రారంభించడం జరిగింది.వైసీపీ తరపున అక్కడి నుంచే పోటీ చేస్తా.
నేను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం కూడా నిజం కాదు.అయిన వారే తనను రాజకీయంగా అనగదొక్కాలని చూస్తున్నారు.కార్యకర్తల కోసం ఎవరినైనా ఎదిరించేందుకు సిద్ధం.ముఖ్యమంత్రిని తప్ప ఎవరిని లెక్క చేయను.జగన్ ( Jagan ) నుంచి నన్ను ఎవరు వేరు చేయలేరు.అంతేకాదు జగన్ సైతం పార్టీ కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
పార్టీ అధ్యక్షుడు సూచించినట్లుగానే ఒంగోలు నియోజకవర్గంలో ప్రతి వైసీపీ కార్యకర్తకు తాను నిరంతరం అండగా ఉంటున్నట్లు బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.బాలినేని చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.