లవర్‌ను బైక్ ఫ్యూయల్ ట్యాంక్‌పై కూర్చోబెట్టి నడిపిన ప్రియుడు.. సీన్ కట్ చేస్తే!

లవర్‌, బైకు పక్కనుంటే చాలు ఈరోజుల్లో యువకులు రెచ్చిపోతున్నారు.వారు ముందు వెనుక ఆలోచించకుండా వేగంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు.

వారి లైఫ్‌ మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా రిస్క్ లో పెడుతున్నారు.కాగా తాజాగా మహారాష్ట్రలోని థానే-బీవాండీ రోడ్డుపై వెళ్తున్న ఓ బైకర్ తన ప్రియురాలిని బైక్ ట్యాంక్‌పై కూర్చోబెట్టుకున్నాడు.

బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై తనకు ఎదురుగా ఆమెను కూర్చోబెట్టుకుని స్టైల్ కొట్టాడు.ఆమె ముందు కూర్చుని ఉండగా అతడు హ్యాండిల్ సరిగా పట్టుకోలేకపోయాడు.

ముందు ఏం వస్తున్నాయో కూడా సరిగా చూడలేకపోయాడు.అయినా ఆమెను అలానే కూర్చోబెట్టుకుని దూసుకెళ్లాడు.

Advertisement
Burqa Clad Womans Bike Stunt With Male Rider Goes Viral,Bike Stunts,Thane Bhiwan

అయితే ఇది చూసిన మరో బైకర్ వీడియో తీయడం ప్రారంభించాడు.కొంత దూరం వెళ్ళాక అతడిని ఆపి ఇలా పబ్లిక్ తిరిగే రోడ్‌లో ప్రియురాలితో కలిసి వేషాలు వేస్తే అందరికీ ప్రమాదం అని చెప్పాడు.

ఆ తర్వాత ఆ ప్రియుడు బుర్కా ధరించి ఉన్న తన ప్రియురాలుని వెనుక సీట్‌లో కూర్చోబెట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.వెళ్ళిపోయే ముందు వీడియో తీస్తున్న వ్యక్తితో గొడవకు కూడా దిగాడు.

ఎందుకు వీడియో తీస్తున్నావని కోపాన్ని వెళ్లగక్కుతూ.రోడ్డుపై తనకు ఇష్టం వచ్చినట్లు పోతానని చెప్పుకొచ్చాడు.

కావాలంటే బండి నంబర్ ప్లేట్ కూడా వీడియో తీసుకో అన్నట్లు మాట్లాడాడు.

Burqa Clad Womans Bike Stunt With Male Rider Goes Viral,bike Stunts,thane Bhiwan
నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
బాన పొట్టను 20 రోజుల్లో ఫ్లాట్ గా మార్చే బెస్ట్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ మీ కోసం!

ఆ దృశ్యాలను వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది.దాంతో పుణె పోలీసులు నిర్లక్ష్యపు రైడింగ్ చేస్తున్న ఈ బైకర్‌పై సంబంధిత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఆపై ఆ వ్యక్తిని జుబైర్ షబ్బీర్ గా పోలీసులు గుర్తించారు.

Advertisement

అలా ఈ బైకర్ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు.

తాజా వార్తలు