నేడు బీఆర్ఎస్ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం

రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ఇవాళ బీఆర్ఎస్ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది.

ఈ మేరకు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించనున్నారు.ఇవాళ శాసనసభా పక్ష సమావేశం, రేపు మంత్రివర్గ సమావేశం జరగనుంది.

కాగా నెల రోజుల వ్యవధిలో పార్టీ రెండోసారి కీలక భేటీ అవుతుంది.ఇందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలపై చర్చించనున్నారు.

మరోవైపు తాజాగా వచ్చిన కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కేసీఆర్ నేతలను అప్రమత్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నేతలను ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.

Advertisement

అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సైతం ప్రభుత్వం సిద్ధం అవుతోందని తెలుస్తోంది.

ఫ్యూచర్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ ముగ్గురి మీదనే ఆధారపడి ఉందా..?
Advertisement

తాజా వార్తలు