ఎన్నికల ప్రచారంలో గులాబీ బాస్ కేసీఆర్ దూకుడు..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తుంది.

ఇందులో భాగంగా గులాబీ బాస్, సీఎం కేసీఆర్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ ప్రచార నిర్వహిస్తున్నారు.

ఈ మేరకు ఇవాళ కూడా మరో నాలుగు నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.ఖానాపూర్, జగిత్యాల, వేములవాడతో పాటు దుబ్బాకలో ప్రజా ఆశీర్వాద సభలకు ఆయన హాజరుకానున్నారు.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80కి పైగా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే మరో పది సభల్లో గులాబీ బాస్ పాల్గొనే అవకాశం ఉంది.

కాగా ఈనెల 28న గజ్వేల్ నియోజకవర్గంలో నిర్వహించే బీఆర్ఎస్ సభతో కేసీఆర్ ఎన్నికల ప్రచారం ముగియనుంది.

Advertisement
వైరల్ వీడియో : అమరావతి శంకుస్థాపన వేదికకు మోకాళ్లపై కూర్చొని నమస్కరించిన సీఎం..

తాజా వార్తలు