ఏంటి ''తమ్ముడు'' షూట్ అప్పుడే అంత ఫినిష్ అయ్యిందా.. ఇంత సైలెంట్ అయితే ఎలా బాసూ!

యూత్ స్టార్ నితిన్ ( Nithiin )వరుసగా ప్లాప్స్ రావడంతో రేసులో వెనుక బడిన కూడా మళ్ళీ క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు.  ప్రజెంట్ ఈయన చేస్తున్న ప్రాజెక్టుల్లో ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’( Extra Ordinary Man ) ఒకటి.

 Nithiin- Venu Siriram Thammudu Shoot Update Details, Thammudu, Nithiin, Siriram-TeluguStop.com

వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.ఇక ఈ సినిమా తర్వాత మరో రెండు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి.

ఛలో, భీష్మ( Bheeshma ) వంటి రెండు సూపర్ హిట్స్ ను అందుకుని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వెంకీ కుడుములతో( Venky Kudumula ) నితిన్ మరో ప్రాజెక్ట్ చేస్తున్నాడు.ఈ రెండు సినిమాలు చేస్తూనే ఈ మధ్యనే ప్రకటించిన ”తమ్ముడు” సినిమా( Thammudu Movie ) షూట్ కూడా సైలెంట్ గా ముగిస్తున్నాడు అనే టాక్ ఇప్పుడు బయటకు వచ్చింది.

పూజా కార్యక్రమాల రోజునే టైటిల్ అనౌన్స్ చేయగా మళ్ళీ ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు.దీంతో ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని అంత అనుకున్నారు.కానీ సైలెంట్ గా అప్పుడే 70 శాతం షూట్ ఫినిష్ చేసినట్టు తెలుస్తుంది.ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా చేస్తూనే మరో వైపు మిగిలిన షూట్ పూర్తి చేస్తూ డబ్బింగ్ కార్యక్రమాలు కూడా షురూ చేసినట్టు సమాచారం.

దిల్ రాజు( Dil Raju ) నిర్మాతగా వేణు శ్రీరామ్( Venu Sriram ) దర్శకత్వంలో ఈ తమ్ముడు(Thammudu) సినిమా తెరకెక్కుతుంది.వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ తర్వాత మరో సినిమాను చేయక పోవడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి తనని తాను నిరుపించుకోవాలని చూస్తున్నాడు.తమ్ముడు అనే టైటిల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది కావడంతో ఈయన ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై ఆసక్తిగా ఉన్నారు.అనుకున్న విధంగా షూటింగ్ పూర్తి అయితే 2024 ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube