నా మాజీ భార్య మనసు నిండా విషమే.. ఏంజెలీనాపై స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్!

ఏంజెలీనా జోలీ, హాలీవుడ్ స్టార్ హీరో అయిన బ్రాడ్ పిట్ ఇది ఇంతకు ముందు భార్య భర్తలుగా ఉన్నవీరు ఆ తరువాత అనుకోని కారణాల వల్ల విడిపోయిన విషయం తెలిసిందే.

బ్రాడ్ మాజీ భార్య ఏంజెలీనా జోలీపై సంచలన ఆరోపణలు చేస్తూ వారిద్దరు కలిసి చేసిన వైన్ వ్యాపారాన్ని ఆమె నాశనం చేసి తనకు హానీ తలపెట్టే ప్రయత్నం చేస్తోందంటూ ఏంజెలీనాపై కోర్డులో పిటిషన్‌ దాఖలు చేశాడు.

ఈ వ్యాపార సామ్రాజ్యంలో ఏంజెలీనా వాటా అమ్మకానికి సంబంధించి ప్రస్తుతం ఇద్దరి మధ్య నడుస్తున్న కేసులో భాగంగా బ్రాడ్ తాజాగా మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు.కాగా ఫ్రాన్స్ లోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ఓ వైన్ యార్డ్‌తో పాటు షాటూ మిరావళ్‌ను 2008లో కొనుగోలు చేశారు.

ఆ తరువాత 2014 వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.అయితే, వివాహ బంధం నుంచి విడిపోయాక గత ఏడాది ఏంజెలీనా.

వ్యాపారంలోని తన వాటాను టెన్యూట్ డెల్ మోండో అనే సంస్థకు అమ్మేసింది.అయితే, దానిని బ్రాడ్ వ్యతిరేకిస్తూ వ్యాపారాన్ని ఎవరికీ అమ్మబోమంటూ ఇద్దరం ఒప్పందం చేసుకున్నామని, కానీ, ఇప్పుడిలా అమ్మేయడం నమ్మకద్రోహమేనని పేర్కొంటూ కోర్టులో పిటిషన్‌ వేశాడు.

Advertisement

ఈ నేపథ్యంలో తాజాగా ఆ కేసుకు సంబంధించి మరిన్ని సంచలన ఆరోపణలు చేశాడు బ్రాడ్‌.

ఇకపోతే ఏంజెలీనా నుంచి వాటాను కొనుగోలు చేసిన టెన్యూట్ డెల్ మోండో సంస్థను రష్యాకు చెందిన యూరీ షెఫ్లర్ అనే ఒక వ్యాపారవేత్త పరోక్షంగా నడుపుతున్నాడని, ఇప్పుడు మిరావళ్‌ను చేజిక్కించుకునేందుకు రహస్య ఒప్పందం చేసుకున్నాడని ఆరోపించాడు.అయితే తెలియని కొత్త వ్యక్తితో తన వ్యాపార భాగస్వామిగా చేయాలని చూసిందని తన సంస్థ పేరు ప్రతిష్ఠలను మంటగలిపి తనకు హాని చేయాలని చూస్తోందని, తన మనసు నిండా విషమే ఉంది అంటూ మాజీ భార్య ఏంజెలీనా పై సంచలన కామెంట్స్‌ చేశాడు బ్రాడ్.

Advertisement

తాజా వార్తలు