మెగా, నందమూరి సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడో తెలుసా?

ఈసారి సంక్రాంతి కానుకగా దుమ్ములేచిపోయే సినిమాలు రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

ప్రతీ ఏడాది లాగా ఈసారి స్టార్ హీరోలు కాకుండా సీనియర్ స్టార్ హీరోలు పోటీ పడబోతున్నారు.

దీంతో ఈ ఇద్దరి స్టార్ హీరోల మధ్య ప్రతీ విషయంలో పోటీ ఎదురవుతుంది.మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ చాలా ఏళ్ల తర్వాత పోటీ పడబోతున్న నేపథ్యంలో ఈ పోటీ ఇప్పుడు మరింత ఆసక్తిగా మారిపోయింది.

ప్రెసెంట్ చిరు చేస్తున్న సినిమాల్లో వాల్తేరు వీరయ్య ఒకటి.ఈ సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

ఇక బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహ రెడ్డి సినిమా చేస్తున్నాడు.ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలోనే రాబోతున్నాయి.

Advertisement

దీంతో వీరిద్దరి సినిమాలకు ప్రతీ విషయంలో పోటీ తప్పేలా లేదు.వీరసింహారెడ్డి జనవరి 12న, వాల్తేరు వీరయ్య జనవరి 13న రిలీజ్ కాబోతున్నాయి.

ఒక్కరోజు తేడాతో ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.ఇక్కడ మరో విశేషం ఏంటంటే.ఈ రెండు సినిమాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ నే నిర్మించింది.

అలాగే ఈ రెండు సినిమాల్లో కూడా శృతి హాసన్ నే హీరోయిన్ గా నటిస్తుంది.అయినా మైత్రి వెనక్కి తగ్గకుండా ఈ రెండు సినిమాలను ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రొమోషనల్ కంటెంట్ బాగా ఆకట్టు కోవడంతో ఇరు హీరోల ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు టికెట్స్ బుకింగ్ చేసుకోవాలా అని ఎదురు చూస్తున్నారు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినట్టు తెలుస్తుంది.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021

యూఎస్ లో ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ పడనున్నాయి.ఓవర్సీస్ లో డిసెంబర్ 29 నుండే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతాయో క్లారిటీ రావాల్సి ఉంది.

తాజా వార్తలు