ఏపీ సీఎం జగన్ పై బోండా ఉమ విమర్శలు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత బోండా ఉమ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.అమరావతిని జగన్ పథకం ప్రకారం నాశనం చేస్తున్నారని ఆరోపించారు.

భూములు ఇచ్చిన రైతులపై పోలీసుల దాష్టీకం దుర్మార్గమని బోండా ఉమ మండిపడ్డారు.రైతులపై డీఎస్పీ పోతురాజు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.

ఎలక్ట్రానిక్ సిటీకి కేటాయించిన భూమిని ఆర్-5 జోన్ గా మార్చడం ప్రభుత్వం మూర్ఖత్వపు చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్ని వర్గాల వారు నివాసం ఉండేలా పేదలకు ఐదు శాతం భూమిని గత టీడీపీ ప్రభుత్వం రిజర్వ్ చేసిందని చెప్పారు.

జగన్ చేపట్టిన సెంట్ పట్టా హడావుడి రాజకీయ ప్రయోజనం కోసమేనని విమర్శించారు.

Advertisement
ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...

తాజా వార్తలు