బ్రహ్మాస్త్ర కి ఆ విషయంలో చాలా రిలాక్స్‌.. మంచి జరిగిందంటూ పార్టీ

బాలీవుడ్ లో దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన బ్రహ్మాస్త్ర సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది సినిమా విడుదలైన రోజు కనీసం వంద కోట్ల వస్తువులను రాబడుతుందా అనే అనుమానాలు వ్యక్తమయాయి.

కానీ లాంగ్ రన్ లో ఈ సినిమా దాదాపుగా 300 కోట్ల రూపాయల కలెక్షన్స్ ను నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ఆ దిశగా సినిమా పరుగులు తీస్తున్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.హిందీ సినిమా ఈ స్థాయిలో ఈ మధ్య కాలంలో వసూళ్లను సాధించడం ఇదే ప్రథమం.

దాదాపుగా మూడు సంవత్సరాల తర్వాత భారీ ఓపెనింగ్స్ ని బాలీవుడ్‌కి అందించిన బ్రహ్మస్త్ర సినిమా బ్రేక్ ఈవెన్ కి మాత్రం చాలా దూరంలోనే ఉండబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దక్కించు కోకున్న రెండవ పార్ట్‌ కి చాలా హోప్ ని కలిగించింది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే బ్రహ్మాస్త్ర యొక్క రెండవ పార్ట్‌ కి సంబంధించిన స్క్రిప్ట్ వరకు పూర్తయింది.ఈ సినిమా యొక్క ఫలితం ఆధారంగా దాన్ని పట్టాలెక్కించే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా కథనాలు.ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో కచ్చితంగా రెండవ పార్ట్ ఉండేది అనుమానమే అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క వసూళ్లు పాజిటివ్ గా ఉండడంతో రెండవ పార్ట్ చేయాలని నిర్ణయానికి యూనిట్ సభ్యులు వచ్చారని.దర్శకుడు ఆయాన్ ముఖర్జీ ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు అంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

మరో వైపు చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమాకు వచ్చిన వసూళ్లు మరియు స్పందన నేపథ్యంలో పార్టీ చేసుకున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.మొత్తానికి అభిమానులు మరియు ప్రేక్షకులు మిశ్రమంగా స్పందించిన వసూలు మాత్రం భారీగా రావడంతో బ్రహ్మాస్త్ర టీం ఊపిరి పీల్చుకున్నట్లు అయింది.

Advertisement

తాజా వార్తలు