చెరపలేని, చెరిగిపోని స్థానం సంపాదించుకున్న అతి కొద్దిమంది హీరోల్లో ఉదయ్ కిరణ్ ఒకడు

ఏ హీరో నైనా గుర్తుపెట్టుకోవాలంటే వంద సినిమాలు చేయక్కర్లేదు.నాలుగు సినిమాలు గుర్తుండేవి చేసినా చాలు.

వాటితోనే ప్రేక్షకులను విపరీతంగా ఇన్స్పైర్ చేయగలిగేంత సత్తా ఉండాలి.నటన ఉంటే చాలు, హీరోయిజం అక్కర లేదు హైట్, బాడీ లాంటివి అసలే అక్కరలేదు అని నిరూపించాడు ప్రేక్షకుల గుండెల్లో జరిగిపోని ముద్ర వేసిన లవర్ బాయ్ ఉదయ్ కిరణ్.

( Uday Kiran ) ఆయన చనిపోయి ఇన్నేళ్లయినా కూడా ప్రేక్షకులు ఎవరు మరిచిపోలేదు అంటే ఉదయ్ వందల సినిమాల్లో నటించాడు అని కాదు.నటించిన ప్రతి సినిమాలో జీవించాడు అని అర్థం.

అప్పట్లో హీరోలు అంటే ఒక లెక్క ఉండేది.నిజమైన హీరో అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలంటూ లెక్కలేనన్ని క్యాలిక్యులేషన్స్ పెట్టుకొని ఉండేవారు సినిమా మేకర్స్.

Advertisement

కానీ ఈ లెక్కలన్నీ కూడా ఉదయ్ కిరణ్ సరి చేశాడు.హీరోలకు నటన వస్తే చాలు ఎంతటి అద్భుతాలు అయినా క్రియేట్ చేయొచ్చు అని నిరూపించాడు.ఆయన నటించిన మొట్టమొదటి సినిమా చిత్రం( Chitram Movie ) తోనే ఒక ట్రెండు ని సృష్టించగలిగాడు.

బాడీ లేదు, డైలాగ్ డెలివరీ లేదు అంటూ ఎంతో మంది ట్రోల్ చేసినా కూడా తనదైన ముద్రను వేసే సినిమాలు చేసి ప్రేక్షకుల్లో ఎప్పటికీ చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకోగలిగాడు.మెగాస్టార్ ఇంటికి అల్లుడు కావాల్సిన వ్యక్తి తన ఓటమిని ఒప్పుకొని తిరిగిరాని లోకానికి వెళ్లిన కూడా ఇప్పటికీ ప్రేక్షకులు ఆయనను గుర్తుంచుకుంటూనే ఉన్నారు.

ఆయన జయంతిని, వర్ధంతిని క్రమం తప్పకుండా ఉదయ్ అభిమానులు( Uday Kiran Fans ) ఘనంగా జరుపుతున్నారు.

చిత్రం, నువ్వు నేను,( Nuvvu Nenu ) మనసంతా నువ్వే,( Manasantha Nuvve ) నీ స్నేహం, శ్రీరామ్, కలుసుకోవాలని, అవునన్నా కాదన్నా వంటి చిత్రాలతో ఎప్పటికీ చెరిగిపోని చిరపలేని తలదైనా ముద్రను ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా ముద్రించి వెళ్లిపోయాడు ఉదయ్ కిరణ్. దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ హీరో వందల సినిమాలు చేసినా కూడా జనాలు గుర్తించరు.కేవలం మంచివి నాలుగు సినిమాలు చేసినా చాలు ప్రేక్షకులు తమ హృదయము శాశ్వతమైన స్థానాన్ని ఇస్తారు అని.అలా చాలా తక్కువ మంది హీరోలు ఉంటారు అందులో ఉదయ్ కిరణ్ ముందు వరసలో ఉంటాడు.హ్యాపీ బర్త్డే ఉదయ్ కిరణ్.

రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు