Penguin Squid : పెంగ్విన్ల మధ్య హృదయాలను తాకే స్నేహం.. వీడియో వైరల్‌..

మనుషులే కాదు జంతువులు కూడా ఒకదానికొకటి సహాయం చేసుకుంటారు.బతికినంత కాలం ఒకదానితో ఒకటి స్నేహం( Friendship ) కూడా చేసుకుంటాయి.

అయితే తాజాగా 2 పెంగ్విన్ల మధ్య ఏర్పడిన అందమైన స్నేహబంధం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ పెంగ్విన్లు ఎల్లప్పుడూ ఒకదానికొకటి సహాయం చేసుకుంటారు.

వాటిలో ఒకదానికి కంటి సమస్య ఉంది.ఇవి యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సర్రేలోని బర్డ్ పార్క్‌( Bird Park )లో నివసిస్తున్నాయి.

పార్క్‌ను బర్డ్‌వరల్డ్ అంటారు.ఇందులో అనేక రకాల పక్షులు, జంతువులు ఉన్నాయి.

Advertisement

అయితే పెంగ్విన్‌లు ఆఫ్రికాకు చెందినవి.వాటి పేర్లు పెంగ్విన్, స్క్విడ్.

వాటి వయసు మూడేళ్లు.

స్క్విడ్ కళ్ళలో కంటిశుక్లం ఉంది.ఆ కంటిశుక్లం వల్ల స్క్విడ్( Squid ) కళ్ళు సరిగా కనిపించవు.అందుకే అది కొన్నిసార్లు తప్పిపోతుంది, గందరగోళానికి గురవుతుంది.

దానికి సహాయం చేయడానికి పెంగ్విన్( Penguin ) ఎప్పుడూ పక్కనే ఉంటుంది.పెంగ్విన్ దానికి బెస్ట్ ఫ్రెండ్.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
జీవితం మహా చెడ్డది భయ్యా.. భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఇంజనీర్‌..?

పెంగ్విన్ స్క్విడ్‌ను ఎక్కడికి వెళ్లాలో, ఏమి చేయాలో అనునిత్యం గైడ్ చేస్తూనే ఉంటుంది.పార్కులో పనిచేసే వ్యక్తులతో కూడా అది ఫ్రెండ్లీగా ఉంటుంది.

Advertisement

స్క్విడ్ పెంగ్విన్( Squid Penguin Friendship ) చేసే వాయిస్, కదలికలను ఫాలో అవుతుంది.వాటి స్నేహానికి కీపర్లు ఎప్పుడూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంటారు.

పెంగ్విన్, స్క్విడ్ రెండూ బాగా అర్థం చేసుకుంటాయని, ప్రత్యేక బంధం కలిగి ఉన్నాయని కీపార్లు తెలిపారు.

పెంగ్విన్ చిన్నతనంలో అనారోగ్యం పాలయ్యింది.అప్పటినుంచి దాని ఆరోగ్యం సరిగా ఉండడం లేదు.అందువల్ల కీపర్ల దానిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

ఇక స్క్విడ్ క్యాటరాక్ట్‌తో పుట్టింది.నిజానికి దీనితో పాటు పుట్టిన అన్ని ఆరోగ్యంగానే ఉన్నాయి కానీ స్క్విడ్ దురదృష్టం కొద్దీ ఆ సమస్యతో పుట్టింది.

అయితే పెంగ్విన్ తన ఫ్రెండ్ అయ్యాక అది సంతోషంగా గడుపుతోంది.ఇవి రెండూ చిన్నతనం నుంచి కలిసే పెరిగాయి.

వీటి స్నేహం ఎప్పుడూ చాలామందిని ఎలా చేస్తోంది.ఈ వీడియో( Viral Video )ను మీరూ చూసేయండి.

తాజా వార్తలు