1200 కిలోమీటర్లు బ్రతుకు సైక్లింగ్... జ్యోతికి ఇవాంకా ప్రశంసలు

లాక్ డౌన్ కారణంగా చేస్తున్న పని లేక ఆకలితో ఎక్కడో బ్రతుకులు లాగలేక సొంత ఊరుకి తరలిపోవడానికి వలస కార్మికులు రోడ్డుబాట పట్టారు.

వందల కిలోమీటర్లు వేల సంఖ్యలో కాలినడకని నడిచి వెళ్ళారు.

ప్రభుత్వం వీరిని గమ్యం చేర్చే ప్రయత్నం చేయకపోవడం అయితే కళ్ళు, లేదంటే సైకిల్ పై సొంతగూటికి వెళ్ళిపోయారు.అలా వెళ్ళిన వారిలో అందరి దృష్టిని ఆకర్షించిన బాలిక జ్యోతి కుమారి.

అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని సైకిల్ మీద కూర్చో బెట్టుకుని 1200 కిలోమీటర్ల దూరం ఏడు రోజుల పాటు సైకిల్ తొక్కి గమ్యానికి చేరుకున్న జ్యోతి కుమారి ప్రతిభని ఇప్పటికే సైక్లింగ్ ఫెడరేషన్ గుర్తించి ట్రయిల్స్ కి రమ్మని కబురు పంపించింది.ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆమె కథనాన్ని చూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ప్రశంసించారు.

జ్యోతి కుమారి ప్రతిభను మెచ్చుకున్నారు.గాయంతో ఉన్న తండ్రిని సైకిల్ మీద ఎక్కించుకుని ఏడు రోజుల పాటు తొక్కుతూ 1200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సొంత గ్రామానికి చేరుకుంది.

Advertisement

ఆ అందమైన ఓర్పు, ప్రేమ భారతీయ సమాజాన్నే కాకుండా సైక్లింగ్ ఫెడరేషన్‌ను కూడా ఆకట్టుకుంది.అంటూ ఇవాంకా ట్రంప్ ట్వీట్ చేశారు.

అంత దూరం సైకిల్ తొక్కడం అంటే సామాన్యమైన విషయం కాదు.ఈ విషయాన్ని గుర్తించిన సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆమె ప్రతిభకి తగ్గ గుర్తింపు అందించే ప్రయత్నం మొదలు పెట్టింది.

జ్యోతి కుమారిని సైక్లింగ్ ట్రయల్స్‌కు రావాల్సిందిగా ఆహ్వానించింది.ఈ ఆహ్వానంపై జ్యోతి కుమారి ఎలా స్పందిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు