బిగ్ బాస్ ఫ్యామిలీ ఎపిసోడ్ వచ్చేస్తోంది.. హౌస్ లోకి షణ్ముఖ్ ఎంట్రీ!

బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో గత సీజన్ ల మాదిరిగానే ఈ వారం ఫ్యామిలీ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి.

దీనితో ఏ కంటెస్టెంట్ కి ఎవరెవరు వచ్చి సపోర్ట్ చేయబోతున్నారు అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో పది మంది కంటెస్టెంట్ లు ఉన్న విషయం తెలిసిందే.ఈ వారం కంటెస్టెంట్స్ తరపున వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ బిగ్ బాస్ స్టేజ్ పై కనిపించబోతున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ అంటే అది ప్రీ ఫైనల్ మాదిరి అని చెప్పవచ్చు.బిగ్ బాస్ హౌస్ లోకి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వెళ్లిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులు మారిపోతాయి.

ఇక కంటెస్టెంట్స్ ని సపోర్ట్ చేయడం కోసం వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్.కంటెస్టెంట్స్ కి చెప్పే జాగ్రత్తలు, మాట్లాడే పాజిటివ్ పాయింట్స్ అన్నీకూడా గేమ్ కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం కచ్చితంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Advertisement
Bigg Boss Non Stop Family Week Here Is The List Of Family Members And Friends En

ఇకపోతే గత సీజన్ లో జశ్వంత్, సిరి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వారి హగ్గులు కిస్సుల గురించి మాట్లాడుతూ బయట ఎంత నెగిటివ్ టాక్ ఉందో చెప్పకనే చెప్పేశారు.ఆ తర్వాత సన్నీ కోసం గిఫ్ట్ గా వచ్చిన వారు పాజిటివ్ గా మాట్లాడడంతో అతనికి బయట ఉన్న ఫాలోయింగ్ గురించి అర్థం అయింది.

Bigg Boss Non Stop Family Week Here Is The List Of Family Members And Friends En

ఈ క్రమంలోనే బిగ్ బాస్ నాన్ స్టాప్ లో బాబా భాస్కర్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి బిందు మాధవిని సేవ్ చేయడంతో బయట ఆమెకు ఉన్న క్రేజ్ గురించి చెప్పకనే చెప్పేశారు.బిగ్ బాస్ నాన్ స్టాప్ లోకి.అఖిల్ తల్లి, బిందు మాధవి తల్లి, నట్రాజ్ మాస్టర్ వైఫ్, అరియానా తల్లి, మిత్రశర్మ క్లోజ్ ఫ్రెండ్ ఇలా కొంతమంది హౌస్ లోకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది.

అఖిల్ కోసం గంగవ్వ లేదంటే సోహెల్ రాబోతున్నట్టు తెలుస్తోంది.యాంకర్ శివ కోసం, బిగ్ బాస్ 5 రన్న రప్ షణ్ముఖ్ జస్వంత్ రాబోతున్నట్లు తెలుస్తోంది.అరియానా కోసం అవినాష్, హమీద కోసం శ్రీ రామచంద్ర, అషు కోసం జెస్సి రాబోతున్నట్టు తెలుస్తోంది.

మరి బిందు మాధవి గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు