నేను ఏ పార్టీ దగ్గర అడుక్కోలేదు.. కూతురుందని ఆరోపణలు.. శివాజీ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తెలుగు ప్రేక్షకులకు నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తెలుగులో ఎన్నో సినిమాలలో నటించిన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్న శివాజీ ఆ తర్వాత సినిమాలు మానేసి రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇది ఇలా ఉంటే ఇటీవలే తెలుగులో ముగిసిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి కంటెంట్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయిన విషయం తెలిసిందే.కాగా బిగ్ బాస్( bigg boss ) హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు శివాజీ.

బిగ్ బాస్ సీజన్ 7 లో శివాజీ ఒక సంచలనం.ఆయన టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యాడు.అయితే చివరి వారాల్లో అంచనాలు తారుమారు అయ్యాయి.

పల్లవి ప్రశాంత్ తన ఆట తీరుతో రేసులోకి దూసుకు వచ్చాడు.పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashanth )టైటిల్ గెలిచినందుకు తనకు సంతోషమే అని శివాజీ అన్నాడు.

Advertisement

ఇటీవలే శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా ప్రారంభించారు.నైంటీస్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేశాడు.

కాగా శివాజీ పాలిటిక్స్ లోకి వెళ్లి ప్రత్యర్థి పార్టీల మీద ఆరోపణలు చేశాడు.ఈ క్రమంలో అతని మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి.

తాజా ఇంటర్వ్యూలో తనపై వచ్చిన అలిగేషన్స్ కి శివాజీ సమాధానం చెప్పాడు.

శివాజీ ఎప్పటికీ శివన్నే ఈ ఆస్తులు, సంపాదన ఎవడికి కావాలి.పరిశ్రమకు చొక్కా ప్యాంటుతో వచ్చాను.నాకు ఎలాంటి రిగ్రీట్స్ లేవు అన్నాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...

పాలిటిక్స్ వెళ్ళాక డబ్బులు సంపాదించారని టాక్ దీనికి మీ సమాధానం ఏంటని ప్రశ్నించగా.నేను ఏ పార్టీ దగ్గర చేయి చాచి అడుక్కోలేదు.

Advertisement

అలా నేను డబ్బులు తీసుకున్నానని నిరూపిస్తే చచ్చిపోతాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు శివాజీ.

ఈ క్రమంలో ఒక యూట్యూబర్ మీద ఫైర్ అయ్యాడు.నాకు మరో పెళ్లి అయ్యింది.పాప కూడా ఉందని ఆరోపణలు చేశారు.

ఇవన్నీ వ్యూస్ కోసం చేసే పనులు మాత్రమే.నా జీవితం అందరికీ తెలిసిందే అన్నాడు.ఇక టైటిల్ కోల్పోవడం మీద కూడా శివాజీ స్పందించాడు.12 వారం తర్వాత తనను విలన్ గా చూపించారు.అది మైనస్ అయ్యిందని శివాజీ చెప్పుకొచ్చాడు.

తాజా వార్తలు