'సలార్' చిత్రం చెత్తగా ఉందంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్ సంచలన కామెంట్స్..ఏకిపారేస్తున్న నెటిజెన్స్!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) హీరో గా నటించిన లేటెస్ట్ చితం సలార్( Salaar ) నిన్న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

చాలా కాలం తర్వాత ప్రభాస్ నుండి ఒక సూపర్ హిట్ సినిమా రావడం తో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.

ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు ఒక కొత్త ప్రపంచం లోకి అడుగుపెట్టినట్టుగా అనిపించింది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేసారు.ఆ కొత్త ప్రపంచం ని ఇష్టపడిన వారు ప్రశాంత్ నీల్ ని( Prashanth Neel ) పొగడ్తలతో ముంచి ఎత్తారు, అర్థం కానీ వాళ్ళు మాత్రం ఇదేమి సినిమా రా బాబు అని తిట్టుకున్నారు.

అలా ఈ చిత్రానికి పూర్తి స్థాయి పాజిటివ్ టాక్ అయితే రాలేదు, కాస్త డివైడ్ టాక్ కూడా వచ్చింది అనే చెప్పాలి.

Bigg Boss Contestant Geetu Royal Shocking Comments On Prabhas Salaar Movie Detai

ఇకపోతే రివ్యూస్ ద్వారా బాగా ఫేమస్ అయ్యి ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 6 లోకి( Bigg Boss 6 ) అడుగుపెట్టి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయిన కంటెస్టెంట్ గీతూ రాయల్.( Geetu Royal ) ఈమె రీసెంట్ గా సలార్ సినిమా రివ్యూ ని చెప్పింది.ఆ చెప్పిన ఈ రివ్యూ ప్రభాస్ ఫ్యాన్స్ కి కాస్త మంటపెట్టేలా చేసిందనే చెప్పాలి.

Advertisement
Bigg Boss Contestant Geetu Royal Shocking Comments On Prabhas Salaar Movie Detai

ఆమె మాట్లాడుతూ అందరూ నన్ను సలార్ సినిమా చూసావా అని అడుగుతున్నారు.ఎలా ఉందో రివ్యూ చెప్పమని అడిగారు.నేను ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద ఫ్లాప్ అవుతుంది అనుకున్నా, కానీ సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయం మారింది.

మూవీ వేరే లెవెల్ లో ఉంది.ముఖ్యంగా ప్రభాస్ కటౌట్ ని చాలా కాలం తర్వాత ఒక డైరెక్టర్ కరెక్ట్ గా వాడుకున్నాడు అని అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది గీతూ రాయల్.

Bigg Boss Contestant Geetu Royal Shocking Comments On Prabhas Salaar Movie Detai

ఇంకా ఆమె మాట్లాడుతూ కానీ ఈ సినిమాని ఒక్కసారి చూస్తే అసలు ఏమి అర్థం కాదు.ఆ ట్విస్టులు, ఆ ప్లాట్ ఆ విధంగా ఉంది.అందరూ డైలాగ్స్ అంత గంభీరంగా ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కాలేదు.

సినిమా ఒక్కసారి చూస్తే ఎక్కదు, పూర్తి అర్థం కావాలంటే రెండు సార్లు సినిమాని చూడాల్సిందే.కానీ స్టోరీ పరంగా మాత్రం సినిమా చాలా బాగుంది అంటూ చెప్పుకొచ్చింది గీతూ రాయల్.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

ఈమె చెప్పిన ఈ రివ్యూ కి సోషల్ మీడియా ప్రభాస్ ఫ్యాన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదురు అవుతుంది.

Advertisement

తాజా వార్తలు