Adi Reddy Revanth: బిగ్ బాస్ హౌస్ లో ఆదిరెడ్డి భార్య, కూతురు.. ఎమోషనల్ అయిన రేవంత్?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 చూస్తుండగానే అప్పుడే 11 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని 12వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం కంటెస్టెంట్ ల ఫ్యామిలీ మెంబర్లు ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆదిరెడ్డికి బిగ్ బాస్ ఒక ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు.ఆదిరెడ్డి భార్య కవిత, కూతురు అద్వైతను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించి ఒకసారిగా ఊహించని షాక్ ఇచ్చాడు.

కూతురు భార్యను చూసిన ఆదిరెడ్డి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు.తర్వాత ప్రేమతో కూతుర్ని ముద్దాడుతూ కాసేపు కూతురుతో కలిసి ఆడుకున్నాడు.

అనంతరం కూతురు భార్యను కిచెన్ లోకి పిలుచుకుని వెళ్లి కూతురికి ప్రేమతో గోరుముద్దలు తినిపించాడు.అప్పుడు ఆదిరెడ్డి తన భార్యని నీ 10 ఓట్లు నాకే కదా అని అడగగా ఆమె సిగ్గు పడింది.

Advertisement
Bigg Boss 6 Telugu 12th Week Adireddy Wife Kavitha And Baby Advitha In Bigg Boss

ఆ తర్వాత ఆదిరెడ్డి నా డాన్స్ వరస్ట్ గా ఉంది కదా కవిత అని అడగగా లేదు నవ్వుకుంటున్నాం అని నవ్వుతూ చెప్పడంతో ఏంటి నువ్వు కూడా నవ్వుతున్నావా అని అది ఆశ్చర్యంగా కామెడీగా అడిగాడు.ఆ తర్వాత హౌస్ మేట్స్ ని పలకరిస్తూ అందరూ మంచివాళ్లు గేమ్ వరకు తిట్టుకోండి కొట్టుకోండి అని కవిత అనగా వెంటనే ఆది నన్ను కూడా కొట్టొచ్చా అని అడగగా వెంటనే కవిత నువ్వేమైనా తోపా అంటూ పంచ్ వేయడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వారు.

Bigg Boss 6 Telugu 12th Week Adireddy Wife Kavitha And Baby Advitha In Bigg Boss

ఆ తర్వాత బిగ్ బాస్ కేక్ పంపించడంతో ఆదిరెడ్డి తన భార్య కూతురు ముగ్గురు కలిసి కేక్ కట్ చేస్తున్నగా మిగిలిన హౌస్ మేట్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ బర్త్డే విషెస్ చెప్పారు.అప్పుడు రేవంత్ థాంక్యూ బిగ్ బాస్ లవ్ యు బిగ్ బాస్.నీకు జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ తన సంతోషాన్ని పంచుకున్నాడు.

కంటెస్టెంట్లు అందరూ ఉన్నా కూడా రేవంత్ మాత్రం ఒక వైపు కూర్చొని తన భార్యని గుర్తు చేసుకుని ఫుల్ ఎమోషనల్ అయ్యాడు.నిండు గర్భిణిగా ఉన్న తన భార్యను గుర్తు తెచ్చుకున్న రేవంత్ ఒకసారిగా కన్నీళ్లు పెట్టుకున్నాడు.

కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?
Advertisement

తాజా వార్తలు