వైరల్ అవుతున్న బిగ్ బాస్ హౌజ్ 4 డ్రోన్ వీడియో!

విజయవంతంగా నాలుగవ సీజన్ లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఇంతకుమునుపు సీజన్స్ కంటే ఎక్కువ ఫన్ తో తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తుంది.

అందుకే రికార్డ్ స్థాయిలో రేటింగ్స్ సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

మరి మనల్ని అంతగా అలరిస్తున్న బిగ్ బాస్ హౌజ్ కి సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది.ఇంతకీ విషయమేంటంటే ఈ షో హోస్ట్ అయిన నాగార్జున మీ ఇంటితో పాటు మా ఇంటిపై కూడా ఓ లుక్ వేయండి అని బిగ్ బాస్ గురించి చెప్పిన విషయాన్ని ఓ వ్యక్తి చాలా సీరియస్ గా తీసుకొని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉన్న బిగ్ బాస్ సెట్ పై నిజంగా డ్రోన్ తో కన్ను వేసి వీడియోను రికార్డ్ చేశాడు.

BigBoss Telugu 4 Latest Viral Video Telugu Big Boss 4, Nagarjuna, Drone Video,

దాన్ని తాజాగా యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు.ఈ షోని ఆదరించడమే కాకుండా ఈ షోకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడానికి తెలుగు ప్రేక్షకులు ప్రయత్నిస్తున్నారు.

అందుకే ఈమధ్య తెలుగు యూట్యూబ్ ఛానెల్స్ అన్నిటిలో బిగ్ బాస్ కంటెంట్ ఎక్కువ దొరుకుతుంది.తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్ వేయండి.

Advertisement
అమెరికాలో భారత సంతతి గ్యాంగ్‌స్టర్ అరెస్ట్ .. ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్ కీలక వ్యాఖ్యలు

తాజా వార్తలు