బడ్జెట్‌లో ఇయర్‌బడ్స్ కొనుగోలు చేయాలని చూస్తున్న వారి కోసం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్( Amazon Great Indian Festival Sale ) అదిరిపోయే ఆఫర్లను తెచ్చింది.అక్టోబర్ 8న ప్రారంభమైన ఈ ఫెస్టివ్ సేల్ ఇయర్‌బడ్స్‌తో సహా వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలపై అద్భుతమైన డీల్స్, డిస్కౌంట్లను అందిస్తుంది.
ఈ సేల్‌లో ఇయర్‌బడ్స్‌పై గరిష్టంగా 70% డిస్కౌంట్, అలాగే ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్, అమెజాన్ పే యూపీఐపై రూ.100 క్యాష్‌బ్యాక్, మరిన్ని ఎక్స్‌ట్రా డిస్కౌంట్స్ పొందవచ్చు.ఇయర్‌బడ్స్ షాపింగ్‌ను సులభతరం చేయడానికి, మేం మీ కోసం రూ.1,000లోపు కొన్ని బెస్ట్ ఇయర్‌బడ్స్ ఏవో చెప్తున్నాము.అవేవో చూసేయండి.
ఈ ఇయర్‌బడ్స్( boAt Airdopes Atom 81 TWS Earbuds ) 50 గంటల బ్యాటరీ బ్యాకప్ ఆఫర్ చేస్తాయి.కేవలం ఐదు నిమిషాల ఛార్జింగ్‌తో 60 నిమిషాల ప్లేటైమ్‌ను అందించే క్విక్ ఛార్జ్ ఫీచర్ ఇందులో ఉంటుంది.ENx సాంకేతికతతో కూడిన క్వాడ్ మైక్రోఫోన్‌లను అందించే ఈ ఇయర్‌బడ్స్ 20Hz నుంచి 20KHz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేంజ్ తో వస్తాయి.13mm ఆడియో డ్రైవర్‌లను కలిగి ఉంటాయి.కనెక్టివిటీ కోసం బ్లూటూత్ v5.3 ఉపయోగిస్తాయి.మీరు అమెజాన్‌లో ఈ ఇయర్‌బడ్స్‌ను రూ.999కి పొందవచ్చు.
ఈ ఇయర్‌బడ్స్( Noise Buds VS104 Truly Wireless Earbuds ) 13mm డైనమిక్ డ్రైవర్లు, 50ms వరకు లో-లేటెన్సీ రేట్‌ను అందిస్తాయి.సంగీతం, గేమింగ్ కోసం అద్భుతమైన సౌండ్ అనుభూతిని కలిగిస్తాయి.కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 200 నిమిషాల ప్లేటైమ్‌ను, మొత్తం 45 గంటల బ్యాటరీ జీవితాన్ని అందించే ఫాస్ట్ ఛార్జ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉన్నారు.ఇయర్‌బడ్స్‌లో కనెక్టివిటీ కోసం బ్లూటూత్ v5.2, సంగీతం, వాల్యూమ్ మరియు కాల్‌ల కోసం స్మార్ట్ టచ్ కంట్రోల్స్ ఉన్నాయి.మీరు అమెజాన్‌లో ఈ ఇయర్‌బడ్స్‌ను రూ.999కి పొందవచ్చు.
ఈ ఇయర్‌బడ్స్( Amazon Basics True Wireless in-Ear Earbuds ) 60 గంటల భారీ బ్యాటరీ లైఫ్ ఆఫర్ చేస్తాయి.అంటే మీరు ఛార్జింగ్ అయిపోతుందని చింతించకుండా రోజుల తరబడి సాంగ్స్ వినొచ్చు.రిచ్, బ్యాలెన్స్‌డ్ సౌండ్ క్వాలిటీని ఉత్పత్తి చేసే 10mm ఆడియో డ్రైవర్లు ఇందులో అందించారు.
ఇది IPX5 రేటింగ్‌ను కలిగి ఉంటుంది.అమెజాన్‌లో ఈ ఇయర్‌బడ్‌లను రూ.899కి సొంతం చేసుకోవచ్చు.
ఈ ఇయర్‌బడ్స్( Boult Audio Z20 TWS Earbuds ) సింగిల్ ఛార్జ్‌పై 45 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తాయి.నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, బేస్ సౌండ్ ఎఫెక్ట్‌లతో గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరిచే BoomX 10mm బాస్ డ్రైవర్లను కలిగి ఉంటాయి.ఇయర్‌బడ్స్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ v5.0తో వస్తాయి.అమెజాన్‌లో ఈ ఇయర్‌బడ్స్‌ను రూ.999కి దక్కించుకోవచ్చు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy