గ్లోయింగ్ అండ్‌ షైనీ స్కిన్ ను కోరుకునే వారికి ఉత్తమమైన రెమెడీ ఇది.. తప్పక ట్రై చేయండి!

సాధారణంగా మన ముఖ చర్మం గ్లోయింగ్( Glowing skin ) గా మరియు షైనీగా మెరిసిపోతూ కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

అందుకోసం రకరకాల చర్మ ఉత్పత్తులను వాడుతుంటారు.

అయితే మార్కెట్లో లభ్యమయ్యే కాస్మోటిక్స్ వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు మాత్రం అటువంటి చర్మాన్ని అందించడానికి అద్భుతంగా సహాయపడతాయి.

అందులో ఇప్పుడు చెప్పబోయే రెమెడీ కూడా ఒకటి.కాంతివంతమైన మరియు మెరిసే చర్మాన్ని కోరుకునే వారికి ఈ రెమెడీ ఉత్తమమైనదిగా చెప్పుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Best Remedy For Glowing And Shiny Skin Glowing Skin, Shiny Skin, Home Remedy, L
Advertisement
Best Remedy For Glowing And Shiny Skin! Glowing Skin, Shiny Skin, Home Remedy, L

ముందుగా ఒక చిన్న నిమ్మ పండును తీసుకొని ఉప్పు నీటితో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే అరకప్పు బాగా పండిన బొప్పాయి( Papaya ) ముక్కలను కట్ చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో బొప్పాయి పండు ముక్కలు, నిమ్మ పండు ముక్కలు వేసుకోవాలి.

అలాగే మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి, రెండు స్పూన్లు రోజ్ వాటర్( Rose Water ) వేసుకుని స్మూత్ ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.

Best Remedy For Glowing And Shiny Skin Glowing Skin, Shiny Skin, Home Remedy, L

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, కావాలి అనుకుంటే చేతులకు కూడా అప్లై చేసుకుని ప‌దిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే చర్మం పై పేరుకుపోయిన మురికి, మృతకణాలు తొలగిపోతాయి.

స్కిన్ గ్లోయింగ్ గా మరియు షైనీ గా మారుతుంది.అందంగా తయారవుతుంది.అలాగే ఈ రెమెడీని కంటిన్యూగా పాటిస్తే చర్మంపై మచ్చలు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

ముడతలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య ఛాయలు త్వరగా తలెత్తకుండా ఉంటాయి.చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా మెరుస్తుంది.

Advertisement

కాబట్టి అందమైన, ప్రకాశవంతమైన మెరిసే చర్మాన్ని కోరుకునేవారు తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.

తాజా వార్తలు