జనవరి 6న అలాస్కా ఎయిర్‌లైన్స్( Alaska Airlines ) బోయింగ్ 737 కిటికీ అకస్మాత్తుగా విరిగిపోయిన సంగతి తెలిసిందే.ఈ విమానం ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్ నుంచి కాలిఫోర్నియాలోని అంటారియోకు వెళుతోంది.
విండో బ్రేక్( Broken Window ) కావడం వల్ల బయట నుంచి లోపలికి గాలి ఒక్కసారిగా దూసుకు వచ్చింది ఈ సమయంలో లోపలి వస్తువులు బయటికి విసిరి వేయబడ్డాయి.ఒక వర్కింగ్ ఐఫోన్( iPhone ) కూడా కిటికీలో నుండి కిందకు పడిపోయింది.
పోర్ట్‌లాండ్‌లో నివసించే సీనాథన్ బేట్స్‌కు( Seanathan Bates ) రోడ్డుపై ఈ ఐఫోన్ కనిపించింది.అతను దాని ఫొటోను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.ఐఫోన్ ఇప్పటికీ ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉందని, దాని బ్యాటరీ సగం మిగిలి ఉందని చెప్పాడు.అలాస్కా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ASA1282 కోసం ఐఫోన్‌లో బ్యాగేజ్ క్లెయిమ్ స్క్రీన్ ఉందని కూడా అతను చెప్పాడు.16,000 అడుగుల నుంచి కింద పడ్డా ఐఫోన్ పగలకపోవడంపై ఆశ్చర్యాన్ని అతడు వ్యక్తం చేశాడు.
ఎక్స్‌లో అతని పోస్ట్ తక్కువ సమయంలోనే వైరల్ గా మారింది.కొన్ని గంటల్లో దీనికి కోటికి పైగా వ్యూస్ వచ్చాయి.అతని పోస్ట్‌పై చాలా మంది లైక్, కామెంట్స్ చేశారు.
ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఐఫోన్ పని చేయడంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఐఫోన్ ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో( Airplane Mode ) ఉన్నందున అది సర్వైవ్ అవ్వగలిగిందని కొందరు సరదాగా కామెంట్లు చేశారు.ఎయిర్‌ప్లేన్ మోడ్ ఫోన్ పడిపోయినప్పుడు విమానంలా కిందకి ల్యాండ్ అయిందా ఏంటి అని మరికొందరికి ఫన్నీగా పేర్కొన్నారు.ఐఫోన్‌లో ఎలాంటి కేస్, స్క్రీన్ ప్రొటెక్టర్ ఉందో మరొకరు తెలుసుకోవాలనుకున్నారు.
ఇవే ఐఫోన్ పూర్తిగా పనిచేయకుండా పోకుండా ఆపగలిగాయని అన్నారు.
ఇంత పైనుంచి పడినా ఐఫోన్ ఎలా తట్టుకుంటుంది అని మరో వ్యక్తి సందేహం వ్యక్తం చేశాడు.
తమ ఐఫోన్‌ను టేబుల్‌పై నుంచి పడేయడంతోనే పగిలిపోయిందని ఇంకొందరు చెప్పారు.ఐఫోన్‌లో ఛార్జర్ విరిగి కొంత భాగం లోపల ఉండిపోయిందని ఓ వ్యక్తి గమనించాడు.