నాజూకైన న‌డుము కావాలా? అయితే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

నాజూకైన న‌డుము కావాల‌ని కోరుకోని వారు ఉంటారా.? నాకు తెలిసైతే ఉండ‌నే ఉండ‌రు.

ముఖ్యంగా మ‌గువ‌లు త‌మ న‌డుమును స‌న్న‌జాజి తీగ‌లా మార్చుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

కొంద‌రైతే తిన‌డం కూడా మానేస్తుంటారు.కానీ, ఎన్ని చేసిన‌ప్ప‌టికీ కొంద‌రి న‌డుముకు రెండు వైపులా కొవ్వు పేరుకు పోతుంటుంది.దాంతో మ‌న‌కే కాదు చూసే వారికి కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.

అయితే ఇటువంటి ఇబ్బందుల‌ను అధిగమించి న‌డుమును నాజూగ్గా మార్చుకోవాలీ అనుకునే వారు త‌ప్ప‌కుండా కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.మ‌రి అవేంటో చూసేయండి.

అందమైన, నాజూకైన‌ నడుమును కోరుకునే వారు మొద‌ట చిరు తిండ్ల‌కు, కూల్ డ్రింక్స్‌కు, షుగ‌ర్ పానియాల‌కు, వేపుడు ఆహారాల‌కు, షుగ‌ర్‌తో త‌యారు చేసిన స్వీట్ల‌కు దూరంగా ఉండాలి.అదే స‌మ‌యంలోనే తీసుకునే ఆహారంలో అన్ని పోష‌కాల‌తో పాటు ఫైబ‌ర్‌, ప్రోటీన్ ఖ‌చ్చితంగా ఉండేలా చూసుకోవాలి.న‌డుము చుట్టూ పేరుకు పోయిన కొవ్వును క‌రిగించ‌డంలో గోరు వెచ్చ‌టి నీళ్లు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

Advertisement

అందు వ‌ల్ల‌, ఉదయం పరగడుపున మొదలుకుని మీకు దాహం వేసినప్పుడల్లా గోరు వెచ్చ‌టి నీళ్ల‌నే తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.అయితే వేడి నీటిని మాత్రం తీసుకోరాదు.

అలాగే ఏ ఆహారం తీసుకున్నా బాగా న‌మిలి న‌మిలి మింగాలి.త‌ద్వారా తీసుకునే ఆహారం త్వ‌ర‌గా జీర్ణం అవుతుంది.

దాంతో జీర్ణ వ్య‌వ‌స్థ‌పై అధిక బారం ప‌డ‌కుండా ఉంటుంది.ఫ‌లితంగా కొవ్వు పెర‌గ‌కుండా ఉంటుంది.

న‌డుమును నాజూగ్గా మార్చుకోవాలి కోరుకునే వారు గంట లేదా క‌నీసం అర గంట సేపైనా వాకింగ్ చేయాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేయ‌డం వ‌ల్ల మీ న‌డుము చుట్టు పేరుకుపోయిన కొవ్వు ఆటోమేటిక్ గా కరుగుతుంది.

నాకు అవార్డు రాకుండా రాజకీయం చేశారు.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!
అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!

శ‌రీర బ‌రువు త‌గ్గించి, న‌డుమును స‌న్న‌గా మార్చ‌డంలో శొంఠి పొడిని గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.ప్ర‌తి రోజు ఒక గ్లాస్ గోరు వేచ్చ‌ని నీటితో అర స్పూన్ శొంఠి పొడి క‌లిపి సేవించాలి.దాల్చిన చెక్క కూడా పొట్ట కొవ్వును త‌గ్గించ‌గ‌ల‌దు.

Advertisement

దాల్చిన చెక్క‌తో త‌యారు చేసిన టీని ఒక క‌ప్పు చ‌ప్పున రెగ్యుల‌ర్‌గా తీసుకుంటే త‌ప్ప‌కుండా మంచి ఫ‌లితం ఉంటుంది.

తాజా వార్తలు