ముఖాన్ని మెరిపించే చింత‌చిగురు.. ఎలాగంటే?

చింతచిగురు.చాలా మంది దీనిని ఇష్ట‌ప‌డి తింటుంటారు.చింత చిగురుతో ఎన్నో వంట‌లూ చేస్తుంటారు.

చింత‌చిగురు ప‌ప్పు, చింతచిగురు రొయ్య‌ల కూర‌, చింతచిగురు చికెన్‌, చింత చిగ‌రు మ‌ట‌న్‌, చింత‌చిగురు ప‌చ్చ‌డి ఇలా చాలా రెసిపీస్ చేస్తుంటారు.చింత చిగురుతో ఎలా చేసినా రుచి అమోగం.

ఇక చింత‌చిగురులో పోష‌కాలు కూడా మెండుగా ఉంటాయి.విట‌మిన్స్‌, మినర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైబ‌ర్ ఇలా అనేక పోష‌కాలు నిండి ఉండే చింత చిగురు కేవ‌లం ఆరోగ్యానికి మాత్ర‌మే కాదు.

చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.మ‌రి చింత చిగురును చ‌ర్మానికి ఎలా వాడాలో చూసేయండి.

Advertisement

ముందుగా చింతచిగురు తీసుకుని శుభ్రం చేసి పేస్ట్ చేసుకోవాలి.ఆ పేస్ట్‌లో చిటికెడు ప‌సుపు మ‌రియు పెరుగు వేసి బాగా క‌లుపుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.ఇర‌వై నిమిషాల పాటు ఆర‌నివ్వాలి.

అనంతరం కోల్డ్ వాట‌ర్‌తో శుభ్రంగా ముఖాన్ని వాష్ చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ముడ‌త‌లు పోయి.

య‌వ్వ‌నంగా మారుతుంది.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

అలాగే మొటిమ‌ల స‌మ‌స్య‌తో బాధ ప‌డేవారు.ఒక బౌల్‌లో చింతచిగురు పేస్ట్‌, కొబ్బ‌రి పాలు వేసి బాగా క‌లుపుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి.

Advertisement

పావు గంట లేదా అర‌గంట పాటు వ‌దిలేయాలి.అనంతరం ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.మొటిమ‌ల‌తో పాటు న‌ల్ల మ‌చ్చ‌లు కూడా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

ఇక ఒక బౌల్‌లో చింత చిగురు ర‌సం, బియ్యం పిండి మ‌రియు ప‌సుపు వేసి బాగా క‌లుపుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పూత‌లా వేసి.

ఆర‌నివ్వాలి.డ్రై అయిన త‌ర్వాత కొద్ది నీళ్లు జ‌ల్లి.మెల్ల‌గా రుద్దుతూ ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల మృత‌క‌ణాలు పోయి.చ‌ర్మం కాంతివంతంగా, ఫ్రెష్‌గా మారుతుంది.

తాజా వార్తలు