ముడ‌తల‌కు, మ‌చ్చ‌ల‌కు చెక్ పెట్టే లావెండ‌ర్ ఆయిల్..ఎలాగంటే?

సాధార‌ణంగా కొంద‌రు ముడ‌త‌లు, న‌ల్ల మ‌చ్చ‌ల‌‌తో తెగ‌ బాధ ప‌డుతుంటారు.

ఎంతో ఖ‌ర్చు పెట్టి ర‌క‌ర‌కాల క్రీములు, లోష‌న్లు కొనుగోలు చేసి వాడినా అవి త‌గ్గ‌నే త‌గ్గ‌వు.

దీంతో మాన‌సికంగా కృంగిపోతుంటారు.అయితే ముఖంపై ఉండే ముడ‌త‌ల‌కు, మ‌చ్చ‌ల‌కు చెక్ పెట్ట‌డంలో లావెండ‌ర్ ఆయిల్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

లావెండ‌ర్ మొక్క‌ల నుంచి తీసే లావెండ‌ర్ ఆయిల్ చ‌ర్మ సౌంద‌ర్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను కూడా నివారిస్తుంది.

మ‌రి లావెండ‌ర్ ఆయిల్‌ను చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ లావెండ‌ర్ ఆయిల్‌, ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి రెండు నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకుని బాగా ఆర‌నివ్వాలి.ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఇలా ప్రతి రోజు చేస్తే క్ర‌మంగా ముడ‌త‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

అలాగే ఒక గిన్నెల్లో లావెండ‌‌ర్ ఆయిల్ తీసుకుని.అందులో కొద్దిగా అలోవెర జెల్ వేసి బాగా క‌లుపుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముకానికి పూత‌లా అప్లై చేసి ఇర‌వై నిమిషాల పాటు వ‌దిలేయాలి.

ఆ త‌ర్వాత కూల్ వాట‌ర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.

ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారా..?
ప్రభాస్ నో చెబితే బన్నీ సక్సెస్ సాధించిన సినిమా ఇదే.. ఆ బ్లాక్ బస్టర్ వెనుక కథ తెలుసా?

ముఖంపై ఉండే న‌ల్ల మ‌చ్చ‌లు క్ర‌మంగా త‌గ్గిపోవ‌డంతో పాటు చ‌ర్మ కాంతి కూడా పెరుగుతుంది.ఇక మొటిమ‌ల స‌మ‌స్య‌ను తగ్గించ‌డంలోనూ లావెండ‌‌ర్ ఆయిల్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

Advertisement

లావెండ‌ర్ ఆయిల్ మ‌రియు టీ ట్రీ ఆయిల్ స‌మానంగా తీసుకుని క‌లుపుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి పావు గంట త‌ర్వాత్ క్లీన్ చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే మొటిమ‌లు మ‌టుమాయం అవుతాయి.‌‌ .

తాజా వార్తలు