బండి సంజయ్ అరెస్ట్ ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టు

బండి సంజయ్ అరెస్ట్ ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టు ప్రశ్నించే గొంతుకను నొక్కే ప్రయత్నాలు ఇక చెల్లవని హితవు ఇల్లంతకుంట మండలం బిజెపి అధ్యక్షులు నాగసముద్రాల సంతోష్.ఇల్లంతకుంట:బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ని అర్ధరాత్రి పోలీస్ అధికారులతో అక్రమ అరెస్టు చేయించడం పట్ల ప్రభుత్వ వైఖరిని తీరును నిరసిస్తూ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే ఆలోచనతో బిజెపి మండల అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్, దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్ లను ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు.

ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడిన టీఎస్పీఎస్పీ పేపర్ లీకు వ్యవహారంలో ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించిందనందుకే అధికార బలంతో అక్రమ అరెస్ట్ చేపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందని, టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజ్ లో జరిగిన కోట్ల రూపాయలు లావాదేవీలలో కేసీఆర్ ప్రమేయం ఉంది కాబట్టే లికేజ్ పై స్పదించడం లేదని ఆరోపించారు.నిరుద్యోగులకు న్యాయం చేయాలని పోరాడుతున్న రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ ని అక్రమ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు.

నీళ్లు, నిధులు, నియామకాల అంశాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మాత్రం నీళ్లలో కమిషన్ల స్కాం, నిధులలో స్కాం, నియామకాలలో పేపర్ లికేజ్ లు చేస్తూ స్కాం లంటూ పాలన కొనసాగిస్తున్నారన్నారు.చేతగాని వ్యవస్థలో ప్రశ్నించే వారిని అరెస్ట్ లు చేయడం తగదని, రానున్న ఎన్నికల్లో ప్రజలే బిఅరెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారన్నారు.

అనంతరం బిజెపి నాయకులు బస్టాండ్ ఆవరణలో బండి సంజయ్ ని వెంటనే విడుదల చేయాలంటూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వజ్జేపెల్లి శ్రీకాంత్, నియోజకవర్గ కో కన్వీనర్ బత్తిని స్వామి, పట్టణ శాఖ అధ్యక్షుడు తిప్పారపు శ్రవణ్, నాయకులు దేశెట్టి శ్రీనివాస్, పొన్నం కృష్ణ, బద్దం ఎల్లారెడ్డి,కొత్తపెల్లి ముత్తక్క సింగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, మణిదీప్, వేణు లు పాల్గొన్నారు.

Advertisement
వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?

Latest Rajanna Sircilla News