లోకేష్ కాకపోతే నేను ! బాలయ్య హింట్ ఇచ్చేశాడు గా ? 

చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఎవరు చేతికి వస్తాయి అంటే , వెంటనే అందరూ చెప్పే సమాధానం ఆయన తనయుడు నారా లోకేష్ పేరే.

ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహాలు లేవు.

సందేహాలు ఉన్నవారే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన పదే పదే తీసుకొస్తున్నారు.ఆయనకే ఆ బాధ్యతలు అప్పగిస్తారని ఆశలు పెట్టుకున్నారు.

కానీ తన రాజకీయ వారసుడిన కాదని , మరొకరికి ఆ బాధ్యతలు అప్పగించేందుకు చంద్రబాబు ఏమాత్రం ఇష్టపడరు.అసలు ఆ ఆప్షన్ ను పరిగణలోకి తీసుకోరు.

లోకేష్ రాజకీయ సామర్థ్యంపై అందరికీ అనుమానాలు ఉన్నాయి.  పార్టీలోని జూనియర్, సీనియర్ అన్న తేడా లేకుండా అందరికీ అనేక అనుమానాలు ఉన్నాయి.

Advertisement
Balakrishna Hopes For The Telugu Desam Party Presidency, TDP, Chandrababu, Jagan

 లోకేష్ టిడిపీ బరువు బాధ్యతలను మోయలేరు అని, ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే పూర్తిగా తెలుగుదేశం దుకాణం మూసుకోవాల్సిందే అన్న అభిప్రాయాలు సొంత పార్టీ నాయకుల నుంచి వ్యక్తం అవుతుండడం తో ఈ పరిస్థితి ఎదురవుతోంది.అయితే లోకేష్ , జూనియర్ ఎన్టీఆర్ కాకపోతే మరి ఆ బాధ్యతలు నిర్వహించగల సమర్థులు ఎవరు అనేదానికి చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ ఆప్షన్ ఇచ్చేసారు.

తెలుగుదేశం పార్టీ బాధ్యతలు తీసుకోవాలని తాను ఎప్పుడూ అనుకోలేదని, ఇవ్వమని నేను అడగను అని, ఇస్తే నిర్వహించగల శక్తిసామర్థలు తనకు ఉన్నాయి అంటూ బాలకృష్ణ ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పిన తీరు చూస్తుంటే బాలయ్య కూడా చంద్రబాబు తర్వాత ఆ బాధ్యతలను అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోంది.అయితే లోకేష్ లేకపోతే నేనే అన్నట్లుగా పార్టీ జనాలకు అధినేత చంద్రబాబుకు బాలయ్య హింట్ ఇచ్చినట్లుగా కనిపిస్తున్నారు.

Balakrishna Hopes For The Telugu Desam Party Presidency, Tdp, Chandrababu, Jagan

 బాలయ్య తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూ అనేక సందేహాలకు కారణం అవుతోంది.నిప్పు లేనిదే పొగ ఎలా రాదో అలాగే ఇప్పుడు బాలయ్య మనసులో మాట ఈ విధంగా బయటకు వచ్చిందని,  కాకపోతే ఎప్పటిలాగే కాస్త గజిబిజిగా వ్యాఖ్యలు ఉన్నట్లుగా కనిపిస్తోంది.చంద్రబాబు కానుక టిడిపి జాతీయ అధ్యక్ష పదవి విషయంలో లోకేష్ పేరు ప్రస్తావన లోకి తీసుకోలేని పరిస్థితుల్లో తన పేరు మరో ఆప్షన్ గా చూస్తారు అనేది బాలయ్య అభిప్రాయంగా కనిపిస్తోంది.

ఎవర్రా మీరంతా..! వ్యక్తిని పాడె ఎక్కించి అలా డాన్సులు చేస్తున్నారు!
Advertisement

తాజా వార్తలు