NBK108 : అనిల్ సినిమాలో అలాంటి పాత్ర పోషించనున్న బాలయ్య!

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దరకత్వంలో చేసిన అఖండ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి అఖండమైన విజయం అందుకుంది.

ఈ సినిమాతో పాత రికార్డులను కూడా చెరిపేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసారు.

ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాడు.ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాను స్టార్ట్ చేసాడు.

 ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ యువ దర్శకుడు హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.

ఈ రోజు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేసారు.ఇక యధావిధిగా బాలయ్య చెప్పిన డైలాగ్స్ కి గూస్ బంప్స్ వచ్చేసాయి.

Advertisement
Balakrishna Characterisation In Anil Ravipudi Film-NBK108 : అనిల్ స

టీజర్ చూస్తుంటే ఈ సినిమా పులిచర్ల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా అనిపిస్తుంది.ఇది పక్కన పెడితే ఈ సినిమా తర్వాత బాలయ్య తన 108 వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడు.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.ఇటీవలే అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 3 సినిమా రిలీజ్ అయ్యింది.

ఇది కూడా ఈయన మార్క్ కు తగ్గట్టుగా ఉండడంతో హిట్ అయ్యింది.

Balakrishna Characterisation In Anil Ravipudi Film

ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వడంతో ఇప్పుడు అనిల్ ఫుల్ కాన్సంట్రేషన్ బాలయ్య సినిమాపై పెట్టాడు.ఈ సినిమాలో బాలయ్య 50 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి పాత్రలో సరికొత్త లుక్ లో కనిపించనున్నారు.ఈ సినిమాలో ఈయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించ బోతున్నారని ఆయన పాత్ర తీర్చిదిద్దిన తీరు ఆశ్చర్యంగా ఉండడం ఖాయం అంటున్నారు.

Advertisement

ఇక ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపించనుందని.హీరోయిన్ గా ప్రియమ అని వార్తలు వస్తున్నాయి.పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.

షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించనున్నారు.

తాజా వార్తలు