ఘనంగా బాలాదిత్య కుమార్తె బారసాల... సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్!

సినిమా ఇండస్ట్రీలో బాలనటుడిగా నటించి ఎంతో మంచి పేరు సంపాదించుకున్న బాలాదిత్య బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించి సందడి చేశారు.

ఇలా బుల్లితెర వెండి తెర కార్యక్రమాల ద్వారా బిజీగా గడుపుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈయన తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమంలో సందడి చేశారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో ఈయన రేలంగి మామయ్యాలా పేరు తెచ్చుకున్నారు.ప్రతి ఒక్క కంటెస్టెంట్ తోను ఈయన ఎంతో హుందాతనంతో ప్రవర్తించేవారు.

ఇలా ఇంట్లో అందరితోనూ ఎంతో మంచిగా హుందాగా వ్యవహరించినటువంటి ఈయన గలాట గీతూతో కలిసి సిగరెట్ ఇష్యూ వల్ల అభిమానులలో కాస్త బ్యాడ్ ఇంప్రెషన్ పొందారు.టైటిల్ రేస్ లో ఉంటారనుకున్నటువంటి బాలాదిత్య అనూహ్యంగా పదవ వారం ఎలిమినేట్ అయ్యారు.

ఇక ఈయన తన ఎలిమినేషన్ ని కూడా ఎంతో హుందాగాతనంగా తీసుకొని ఎమోషన్స్ బయట పెట్టకుండా హౌస్ నుంచి బయటకు వచ్చారు.

Baladityas Daughter Barasala The Bigg Boss Contestants Made Noise, Baladityas D
Advertisement
Baladityas Daughter Barasala The Bigg Boss Contestants Made Noise, Baladitya's D

ఇక బాలాదిత్య బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేముందు తన రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఆదిత్య బిగ్ బాస్ హౌస్ లోకి రావడంతో తన కుమార్తె బారసాల కార్యక్రమాన్ని ఇంతవరకు నిర్వహించలేదు.అయితే ఈయన హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం మంచి రోజు చూసుకుని తన కూతురికి నామకరణం చేశారు.

ఈ క్రమంలోనే డిసెంబర్ 15వ తేదీ బాలాదిత్య చిన్న కుమార్తెకు నామకరణం చేశారు.ఈ బారసాల కార్యక్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్లు సూర్య, గీతూ, ఇనయా, ఆరోహిరావు, వాసంతి బాల ఆదిత్య కూతురు బారసాల కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇక బాలాదిత్య తన కుమార్తెకు యజ్ఞ విధాత్రి అనే నామకరణం చేశారు.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు