ఆన్‌లైన్‌ మోసాలు, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

పోలీసు శాఖ( Police department ) ఆధ్వర్యంలో మహిళల భద్రత,రక్షణ సైబర్‌ క్రెం ఆన్‌లైన్‌ మోసాలు తదితర అంశాలపై గురువారం హుజూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఎస్ఐ ముత్తయ్య అధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు.

మహిళలు,విద్యార్థినులు ఈవ్‌టీజింగ్‌కు గురైతే షీటీం వెంటనే స్పందిస్తుందని,మహిళల రక్షణ కోసమే షీటీమ్స్‌ ఏర్పాటు చేసారని,సైబర్ నేరాల పట్ల ప్రజలు పూర్తి అవగాహన కలిగి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు.విద్యార్థినీ విద్యార్థులకు ఎడ్యుకేషన్ అవేర్నెస్ తో పాటు జిల్లాలో ఉన్న షీ టీమ్స్ బృందాలు,మహిళల భద్రత,రక్షణ,100 డైల్ , సోషల్ మీడియా,ఓటిపి ఫ్రాడ్స్,సైబర్ నేరాలు,టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి, సెల్ ఫోన్ వలన కలిగే అనర్ధాల గురించి, విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ బలరాం రెడ్డి,ఇతర పోలీసు సిబ్బంది,కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
Advertisement

Latest Suryapet News