ఆటాడుకుందాం రా మూవీ రివ్యూ

చిత్రం : ఆటాడుకుందాం రా బ్యానర్ : శ్రీనాగ్ కార్పోరేషన్, శ్రీజి ఫిలిమ్స్ దర్శకత్వం : జి.నాగేశ్వర రెడ్డి నిర్మాత : నాగసుశీల, చింతలపూడి శ్రీనివాస రావు సంగీతం : అనూప్ రుబెన్స్ విడుదల తేది : ఆగష్టు 19, 2016 నటీనటులు : సుశాంత్, సోనమ్ బజ్వా, మురళీశర్మ తదితరులు సినిమాల్లోకి వచ్చి చాలాకాలమైనా, సుశాంత్ కి ఇంతవరకు సరైన సక్సెస్ లభించలేదు.

మరోవైపు చిన్న కామెడి చిత్రాలకి కేరారెడ్డి అడ్రస్ జి.నాగేశ్వర రెడ్డి.వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ఆటాడుకుందాం రా.చాలా పెద్ద గ్యాప్ తీసుకోని సుశాంత్ చేసిన మరో ప్రయత్నం తన కెరీర్ కి సహాయపడుతుందా లేదా చూద్దాం.కథలోకి వెళ్తే .విజయ్ రామ్ (మురళీశర్మ) ఒక స్నేహితుడి వలన తన ఆస్తులన్ని పోగొట్టుకున్నాని బాధడుతూ ఉంటాడు.అతనికో కూతురు శృతి (సోనమ్ బజ్వా).

అమెరికా నుంచి ఇండియా కి వచ్చిన కార్తిక్ (సుశాంత్) శృతితో ప్రేమలో పడటమే కాదు, తన కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రయత్నాలన్ని చేస్తూ ఉంటాడు.అతనికో సీక్రేట్ మిషన్ కూడా ఉంటుంది.

ఇంతకి కార్తిక్ లక్ష్యం ఏమిటి ? అసలు విజయ్ రామ్ జీవితంలో సమస్యలకి కారణం ఎవరు? కార్తిక్ కథను సుఖాంతం ఎలా చేసాడు అనేది మిగితా కథ.నటీనటుల నటన గురించి సుశాంత్ లుక్ బాగుంది.హావభావాలు ఇంకా మెరుగుపరచుకోవాల్సిందే.

ఇక డ్యాన్సులు, ఫైట్లు ఇప్పుడు ఎవరు చేయట్లేదని సుశాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి.సోనమ్ నటిగా మార్కులు కొట్టలేకపోయినా, గ్లామర్ తో పనికానిచ్చేసింది.

Advertisement

అయితే సినిమాకి మాత్రం తన స్కిన్ షో ఉపయోగపడదు.మురళీ శర్మ ఫర్వాలేదు.

పోసాని అంతే.మిగితా సినిమాల్లాగే ఇందులోనూ 30 ఇయర్స్ పృథ్వీ మెరుపులు కొన్ని ఉన్నాయి.

వెన్నెల కిషోర్ తనకిచ్చినంతలో బాగా చేస్తే, బ్రహ్మానందం ఓకే అనిపించారు.సాంకేతికవర్గం పనితీరు : ఆడియో విడుదలైన రోజు నుంచి సంగీతమ ఎవరిని పెద్దగా ఆకట్టుకోలేదు.అనూప్ రుబెన్స్ పాటలే కాదు, నెపథ్య సంగీతం కూడా ప్రేక్షకులని డిజపాయింట్ చేస్తుంది.

నిర్మాణ విలువలు బాగున్నాయి.ఎడిటింగ్ సినిమాకి ఎలాంటి లాభాన్ని చేకూర్చలేదు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ పడి ఫ్లైట్ డోర్ ఊడబీకేసిన వ్యక్తి.. తర్వాతేమైందో తెలిస్తే..?

సినిమాటోగ్రాఫి ఫర్వాలేదు.మంచి కామెడి సెన్స్ ఉన్న నాగేశ్వర రెడ్డి, ఈసారి సరైన కథావస్తువు తీసుకోకపోవడం వలన, తీసుకున్న అంశాన్ని సరిగా తెరకెక్కించలేక, ఘోరంగా విఫలమయ్యాడు.

Advertisement

విశ్లేషణ ఇప్పటి అగ్రహీరల కెరీర్ ని గమనిస్తే, తొలిప్రేమ, తమ్ముడు, ఖుషి చిత్రాల్లో బలమైన కథతో పాటు బలమైన పాత్ర ఉన్న పవన్ కళ్యాణ్ కనబడతాడు.మహేష్ బాబుకి ఇలాంటి కథాబలం ఉండి బలమైన పాత్రలున్న చిత్రాలుగా మురారి, ఒక్కడు, పోకిరి నిలిచాయి.

ఇదే తరహాలో ఎన్టీఆర్‌ ఆది, సింహాద్రి చిత్రాలతో ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకున్నాడు.ఈ విషయం ఇప్పటి యువ కథనాయకులకి అర్థం కావడం లేదు.

బ్రహ్మానందం, 30 ఇయర్స్ పృథ్వీని సీన్ లో వేసుకున్నాక వాళ్ళెక్కడ హైలైట్ అవ్వాలి? కొత్తదనం కథలో లేకపోయినా, నటనలో, ఆటిట్యూడ్ లో అయినా చూపించాలి.మన ముగ్గురు టాప్ కథానాయకుల్లో ఎవరి స్టయిల్ వారికి ఉంది.

అందుకే జనాలకి వాళ్ళంటే ఇష్టం.అలా కాకుండా గుంపులో గోవిందంలా నలుగురు కామెడియన్లను వేసుకోని, కథ లేని బండిని లాగడానికి ప్రయత్నిస్తూనే ఉంటే సుశాంత్, ఆది లాంటి హీరోలు ఎప్పటికి హిట్ కోసం, ఇమేజ్ కోసం ఎదురుచూస్తూనే ఉండాలి.

ఇక్కడ సినిమా గురించి విశ్లేషించడానికి పెద్దగా ఏమి లేదు.మూస పొకడలో కొట్టుకుపోయే మరో సినిమా ఈ ఆటాడుకుందాం రా.నాలగైదు కామెడి సీన్లు, విసుగు పుట్టించే డైలాగులు, ఎందుకు వస్తున్నాయో అర్థం కాని పాటలు.ఇంకా బకరా కామెడిని నమ్ముకోవడం మూర్ఖత్వం.

చివరికి నాగచైతన్య, అఖిల్ చేసిన స్పెషల్ పాత్ర, పాట కూడా సినిమాని ఏమాత్రం కాపాడలేకపోయాయి.ఇక లాజిక్ గురించి అస్సలు మాట్లాడుకోకపోతేనే మంచిది.

లాజిక్ తో ఒక ఆటాడుకున్నారు.హైలైట్స్ : * అక్కినేని బ్రదర్స్ గెస్ట్ అపియరెన్స్ డ్రాబ్యాక్స్ : * కథ, స్క్రీన్ ప్లే * పేలని కామెడి * అనవసరపు సన్నివేశాలు * ఎడిటింగ్ * ఆకట్టుకోని ఆర్టిస్టులు చివరగా : ఆటాడుకున్నారు ప్రేక్షకులని

తెలుగుస్టాప్ రేటింగ్ : 1.5/5

.

తాజా వార్తలు