పేటలో ఆరోగ్యశ్రీ సేవలు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని హెల్తీ ఫై ప్రైవేట్ హాస్పిటల్ కు ఆరోగ్యశ్రీ పథకం అనుమతి లభించడం అభినందనీయమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.

ఆదివారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇటీవల హాస్పిటల్ కు ఆరోగ్యశ్రీ పథకం అనుమతిస్తూ రాష్ట్ర చీఫ్ మెడికల్ ఆడిటర్ లెటర్ అందజేయగా హాస్పిటల్ అధినేత మతకాల చలపతిరావు ఆదివారం మంత్రి జగదీష్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్ లు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు.వైద్యులు సేవా దృక్పథం కలిగి వైద్య సేవలు అందించాలన్నారు.

ఆస్పత్రి ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లోనే హెల్తీ ఫై కి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుండి ఆరోగ్య శ్రీ వైద్య సేవలు అందించడానికి కావాల్సిన అనుమతి పత్రాన్ని అందజేయడం హర్షణీయమన్నారు.ఆరోగ్యశ్రీ అనుమతితో బాధ్యత మరింత పెరిగిందని ప్రతి కార్మికునికి అందుబాటులో హాస్పిటల్ ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు,ఎంపీపీ భిక్షం పాల్గొన్నారు.

Advertisement
రైతు భరోసా పథకంపై ప్రజాభిప్రాయ సేకరణ

Latest Suryapet News