తెలంగాణ యాసలో గలగల మాట్లాడిన అర్హ... మాటలకు ఫిదా కావాల్సిందే !

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి నటుడు అల్లు అర్జున్( Allu Arjun ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప( Pushpa ) సినిమా అల్లు అర్జున్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి.ఈ సినిమా ద్వారా ఫాన్ ఇండియా స్థాయిలో ఈయన మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

Arha Cute Video Goes Viral In Social Media Details,allu Arjun,allu Arha,allu Arh

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కినటువంటి ఈ సినిమా భారీ స్థాయిలో సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానుంది.

ఇదిలా ఉండటం ఇటీవల మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో( Madame Tussauds Museum ) అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే .ఈ విగ్రహాన్ని అల్లు అర్జున్ చేతుల మీదుగా ప్రారంభించారు.

Arha Cute Video Goes Viral In Social Media Details,allu Arjun,allu Arha,allu Arh
Advertisement
Arha Cute Video Goes Viral In Social Media Details,Allu Arjun,Allu Arha,allu Arh

ఇక విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులందరూ కూడా దుబాయ్ వెళ్లారు.ఈ విగ్రహం ఏర్పాటు రోజు అల్లు అర్హ( Allu Arha ) బన్నీ మధ్య జరిగినటువంటి ఒక సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.అల్లు అర్జున్ విగ్రహపు బొమ్మను చూపిస్తూ అల్లు అర్జున్ నా బొమ్మ ఎలా ఉంది అంటు తన కుమార్తె అర్హను అడిగారు.

ఇందుకు అర్హ సమాధానం చెబుతూ నువ్వు కూడా ఇట్ల పెట్టు. అది ఎట్లా ఉందో అట్లనే పెట్టు అంటూ అల్లు అర్జున్ విగ్రహపు తరహాలో ఫోజ్ ఇవ్వమని తెలంగాణ యాసలో చెప్పేశారు.

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు తెలంగాణ యాస( Telangana Slang ) సూపర్ అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు తెలంగాణ బిడ్డ అంటూ ఈ వీడియో పై కామెంట్లో చేస్తున్నారు.ఏది ఏమైనా ఒక స్టార్ కిడ్ ఇలా అచ్చమైన తెలంగాణ యాసలో మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు.ప్రస్తుతం అందరూ కూడా పిల్లలు ఇంగ్లీషులో మాట్లాడుతుంటారు కానీ అల్లు అర్జున్ స్టార్ హీరో అయినప్పటికీ తన కుమార్తెకు ఇలా తెలంగాణ యాసాలో మాట్లాడటం నేర్పించడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఇక అల్లు అర్హ ముద్దుబిడ్డగా మాట్లాడినటువంటి ఈ మాటలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...
Advertisement

తాజా వార్తలు