Tharun : తరుణ్ ఇంతమందితో అఫైర్స్ పెట్టుకున్నారా… లవర్ బాయ్ అనే బిరుదుకు న్యాయం చేశారా?

సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత సెలబ్రిటీల గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో రావడం సర్వసాధారణం.

ఒక హీరో హీరోయిన్ రెండు మూడు సినిమాలలో రిపీటెడ్ గా నటిస్తే కనుక తప్పకుండా వారి గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతుంది.

ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారని ప్రేమించుకుంటున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి.అయితే సోషల్ మీడియా అభివృద్ధి చెందని సమయంలో కూడా హీరో హీరోయిన్ల గురించి ఇలాంటి వార్తలే పెద్ద ఎత్తున వచ్చేవి.

ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు తరుణ్ ( Tharun ) ఒకరు.ఈయన గురించి కూడా ఎన్నో రకాల వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

తరుణ్ నటి రోజా రమణి వారసుడిగా బాలనటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చారు.అనంతరం హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఆర్తి అగర్వాల్ ప్రియమణి వంటి హీరోయిన్లతో ప్రేమలో ఉన్నారు అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.

Advertisement

అయితే వీరిద్దరూ మాత్రమే కాకుండా ఈయన మరొక హీరోయిన్ తో కూడా సీక్రెట్ గా ఎఫైర్ కొనసాగించారని తెలుస్తుంది.తరుణ్ మొదట ఆర్తి అగర్వాల్ తో కలిసి పలు సినిమాలలో నటించారు.

దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అని వార్తలు రావడమే కాకుండా ఇద్దరు కూడా పీకలోతు ప్రేమలో మునిగిపోయారని పెళ్లి కూడా చేసుకోవాలని భావిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.అయితే తరుణ్ తో అగర్వాల్ ప్రేమలో ఉంది అంటూ వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఆర్తి అగర్వాల్ తల్లిదండ్రులు ఆమెకు బలవంతంగా వేరొక వ్యక్తితో పెళ్లి చేశారు అయితే కొన్ని కారణాలవల్ల అనారోగ్య సమస్యల కారణంగా ఆర్తి అగర్వాల్ ( Arthi Aggarwal ) మరణించారు.

ఇక ఆర్తి అగర్వాల్ తర్వాత ఈయన నటి ప్రియమణి( Priyamani ) తో కూడా ప్రేమలో ఉన్నారు అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.వీరిద్దరూ కలిసి నవ వసంతం సినిమాలో నటించారు.

ఈ విధంగా తరుణ్ ఇద్దరి హీరోయిన్లతో ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు రావడమే కాకుండా ఈయన మరొక హీరోయిన్ తో కూడా ఎఫైర్ కొనసాగించారంటూ వార్తలు వస్తున్నాయి.నిన్నే ఇష్టపడ్డాను అనే సినిమా ద్వారా హీరోయిన్ నటి శ్రీదేవి ( Sri devi ) జంటగా నటించారు.ఈ సినిమా సమయంలో వీరిద్దరి కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవ్వడమే కాకుండా వీరిద్దరూ కూడా చాలా క్లోజ్ గా మూవ్ అవ్వడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరు కూడా బ్రేకప్ చెప్పుకున్నారు.

Advertisement

ఇలా తరుణ్ పలువురు హీరోయిన్లతో సాగించడంతో ఈయనకు లవర్ బాయ్ అనే బిరుదు కరెక్ట్ గా సరిపోయిందని తన బిరుదుకు తగ్గట్టుగా న్యాయం చేస్తున్నారో అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.ఇక తరుణ్ ప్రేమించిన హీరోయిన్స్ అందరు కూడా పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో మంచిగా సెటిల్ అయ్యి చాలా సంతోషంగా ఉన్నారు అయితే ఈయన ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోకుండా సింగల్ గానే ఉండటం గమనార్హం.గత కొద్ది రోజుల క్రితం ఈయన మెగా ఇంటికి అల్లుడు కాబోతున్నారనీ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలపై తరుణ్ స్పందిస్తూ ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.

తాజా వార్తలు