ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడికి ఏపీ హైకోర్టు ఆదేశాలు

ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు ధిక్కరణ కేసులో భాగంగా వ్యక్తిగతంగా హాజరు కావాలని పేర్కొంటూ ఫామ్- 1 జారీ చేసింది.

గతంలో ఫార్మసీ కాలేజీల అప్లికేషన్ రుసుమును మూడింతలు పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వులను ఫార్మసీ కాలేజీలు హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

అయితే ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పీసీఐ అమలు చేయలేదు.ఈ నేపథ్యంలో కాలేజీలు వేసిన కోర్టు ధిక్కరణ కేసును తీవ్రంగా పరిగణించిన హైకోర్టు ఫామ్ -1ను జారీ చేసింది.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!
Advertisement

Latest Latest News - Telugu News