ఏపీకి మూడు రాజధానులు అవసరం లేదు.. చంద్రబాబు వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.కర్నూలు జిల్లాలోని ఆదోనిలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆర్థిక అక్రమార్కుల ఆట కట్టించాలన్నారు.పిల్లల భవిష్యత్ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు.

AP Does Not Need Three Capitals.. Chandrababu Comments-ఏపీకి మూడ

చేతిని అడ్డం పెట్టి సూర్యరశ్మిని అడ్డుకోలేరని తెలిపారు.వైసీపీ నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోవద్దని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు.అన్నింటిపైనా చార్జీల మోత మోగిస్తున్నారని, ఆఖరికి చెత్తపై కూడా పన్ను వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.ఏపీకి మూడు రాజధానులు అవసరం లేదన్నారు.

వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు