బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ సీఎం జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్( AP CM YS Jagan ) ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

" దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.

ఈ పండుగ జరుపుకుంటారు.త్యాగనికి ప్రతీక బక్రీద్ పండుగ నిదర్శనం" అని అన్నారు.

"ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా రాగ ద్వేషాలకు అతీతంగా ముస్లింలు( Muslims ) అందరు ఈ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు.అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా" అనే సీఎం జగన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

ఈనెల 29 అనగా రేపు గురువారం బక్రీద్( Bakrid ) సందర్భంగా దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగ ముస్లిం ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు.ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో రంజాన్ తర్వాత జరుపుకునే పండుగ బక్రీద్.

Advertisement

త్యాగానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగను.అత్యంత భక్తి భావంతో ప్రత్యేక ప్రార్థనలతో కుటుంబ సమేతంగా జరుపుకుంటారు.

రేపు బక్రీద్ పండుగ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సెలవు.దీంతో చాలామంది రాజకీయ నేతలు సోషల్ మీడియా వేదికగా బక్రీదు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు