న్యూస్ రౌండప్ టాప్ 20

1.జగనన్న చేదోడు నిధులు విడుదల

మూడో విడత జగనన్న చేదోడు పథకం కింద సాయాన్ని అర్హులకు అందజేసింది .

దర్జీలు,  రజకులు, నాయి బ్రాహ్మణులకు పదివేల సాయాన్ని జగన్ విడుదల చేశారు.

2.బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు సిఐఎస్ఎఫ్ బలగాలు

బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉగ్రవాద నియంత్రణ చర్యలకు మరింత పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.దీనిలో భాగంగానే 1700 మంది సెంట్రల్ ఇండస్ట్రీ  సెక్యూరిటీ ఫోర్స్ బలగాలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.

3.సిఐడి ఆఫీసుకు చింతకాయల విజయ్

టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఈరోజు గుంటూరు జిల్లాలోని సిఐడి కార్యాలయానికి విచారణ నిమిత్తం చేరుకున్నారు.

4.ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 412 విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది.షార్జా కొచ్చిన్ విమానంలో హైడ్రాలిక్ వైఫల్యాన్ని పైలెట్ గుర్తించడంతో వెంటనే ఎమర్జెన్సీ ల్యాడింగ్ చేశారు.

5.  ఎలుగుబంటి సంచారం

కామారెడ్డి జిల్లాలోని బిక్కనూరు మండలం కేంద్రంలోని సిద్ధ సోమేశ్వర ఆలయ సమీపంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతుంది.

6.గవర్నర్ పై శాసనమండలి చైర్మన్ కామెంట్స్

రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు హద్దుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ను ఉద్దేశించి అన్నారు.

7.నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

బిజెపితో మళ్ళీ కలవడంపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.బిజెపితో మళ్ళీ పొత్తు కంటే చావడమే మేలంటూ ఆయన వ్యాఖ్యానించారు.

8.  విపక్షాలపై జగన్ కామెంట్స్

వెన్నుపోటు దారులకు,  మీ బిడ్డ జగన్ కు మధ్య యుద్ధం జరుగుతోందని,  మీ బిడ్డకు పొత్తులు ఉండవు , ఒంటరిగా సింహం లా పోరాడుతాడు.తోడేళ్లు అందరూ ఒకటైనా పేద ప్రజలు ఇచ్చిన బలంతో పోరాటం చేస్తానని ఏపీ సీఎం జగన్ అన్నారు.

9.లవ్ జీహాదీ కి వ్యతిరేకంగా భారీ ప్రదర్శన

లవ్ జీహాద్ కి వ్యతిరేకంగా ముంబైలో వేల మంది రోడ్లపై భారీ ప్రదర్శన చేపట్టారు.ముస్లింలు హిందువులు భూములను అక్రమంగా ఆక్రమించుకోవడం,  హిందూ యువతులను ప్రేమ పేరుతో తీసుకువెళ్లి మతం మార్చుతూ ఉండడం పై నిరసన వ్యక్తం చేశారు.

10.వైద్యులకు హరీష్ రావు వార్నింగ్

వైద్యం కోసం వచ్చిన రోగులను పట్టించుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని వైద్యులు , సిబ్బందికి హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు.

11.కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై పిటిషన్ వేసిన కేఏ పాల్

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలంగాణ హైకోర్టులో ఫీల్ దాఖలు చేశారు.

12.నేడు భారత్ జూడో యాత్ర ముగింపు సభ

కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈరోజు శ్రీనగర్ లోని షేర్ ఏ కాశ్మీర్ స్టేడియంలో ముగుస్తుంది.

13.జగన్ ఢిల్లీ పర్యటన

ఏపీ సీఎం జగన్ ఈరోజు ఢిల్లీకి వెళ్ళనున్నారు.రేపు కూడా జగన్ ఢిల్లీలోనే పర్యటిస్తారు.

14.నేడు అఖిలపక్ష భేటీ

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక రోజు ముందుగా ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.ఈ సమావేశం ఈరోజు మధ్యాహ్నం పార్లమెంట్ ఆన్ ఎక్స్ భవనంలో జరగనుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద జోషి తెలిపారు.

15.మెదక్ జిల్లాలో కేటీఆర్ పర్యటన

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

నేడు మెదక్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు  మనోహరాబాద్ లో ఐటిసి ఫుడ్ పరిశ్రమను కేటీఆర్ ప్రారంభించనున్నారు.

16.విపక్షాలతో ప్రధాని భేటీ

రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో విపక్షాలతో విడివిడిగా ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కానున్నారు.

17.నేడు రాజమండ్రిలో హరిత యువత కార్యక్రమం

Advertisement

నేడు రాజమండ్రిలో హరిత యువత కార్యక్రమం లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ , ఎంపీ మార్గాని భరత్ రామ్ సంయుక్తంగా విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

18.ఎల్జి పాలిమర్స్ ఘటనపై హైకోర్టులో విచారణ

ఏపీ హైకోర్టులో ఈరోజు ఎల్జి పాలిమర్స్ ఘటనపై దాఖలైన ఫీల్ పై విచారణ జరిగింది .ఈ ఘటనపై ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనుంది.

19.హర్యానా గవర్నర్ పర్యటన

నేడు విశాఖ శారదాపీఠం వార్షికోత్సవంలో పాల్గొని రాజ్యశ్యామల అమ్మవారికి పూజలు చేయనున్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ.

20.తారకరత్నకు వైద్య పరీక్షలు

ఇది ఒక గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన నందమూరి తారకరత్నకు మరోసారి కీలకమైన ఆరోగ్య పరీక్షలను నిర్వహించనున్నారు.

అలాగే ఆయనకు వైద్య సహాయం అందించేందుకు మరి కొంతమంది స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం రానున్నారు.

తాజా వార్తలు