న్యూస్ రౌండప్ టాప్ 20

1.సిద్దిపేటలో 2 కే రన్ ప్రారంభం

జాతీయ క్రీడ దినోత్సవం పురస్కరించుకుని సిద్దిపేట జిల్లాలోని కోమటి చెరువు నెక్కుల రోడ్డులో సోమవారం మంత్రి హరీష్ రావు 2కె రన్ ను ప్రారంభించారు.

 

2.మావోయిస్టుల కదలికలు

  అదిలాబాద్ జిల్లాలో మావోయిస్టులు కదలికలతో పోలీసులు అలర్ట్ అయ్యారు.ఉమ్మడి జిల్లాలో అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. 

3.తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

 

తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది .ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 

4.కాలేశ్వరం సందర్శనకు అనుమతి ఇవ్వాలి

  కాలేశ్వరం సందర్శనకు బిజెపి ప్రతినిధుల బృందం కు టిఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. 

5.బిజెపి టీఆర్ఎస్ పై షర్మిల కామెంట్స్

 

టిఆర్ఎస్ బిజెపిలో రెండు ఒకటేనని, పైకి మాత్రం రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నాయి అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు . 

6.నేడు పెద్దపల్లి జిల్లాకు కెసిఆర్

 తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు పెద్దపల్లి జిల్లా పర్యటనకు రానున్నారు. 

7.ప్రధానిపై కేటీఆర్ కామెంట్స్

 

Advertisement

తన సొంత రాష్ట్రం గుజరాత్ కి చెందిన మహిళ బిల్కస్ భాను కేసులు దోషులను అక్కడ ప్రభుత్వం విడుదల చేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు . 

8.కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక

  కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఎన్నికను అక్టోబర్ 17న నిర్వహించేందుకు సిడబ్ల్యుసి తీర్మానించింది. 

9.సీనియర్ నటుడు విద్యాసాగర్ మృతి

 

ప్రముఖ నటుడు విద్యాసాగర్ (73) కన్నుమూశారు. 

10.భారత్ లో కరోనా

  గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 7,591 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

11.నేడు ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం

 

దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తుందన్న వాదన మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. 

12.నేటి నుంచి యూఎస్ టోర్నీ

  నేటి నుంచి యూఎస్ ఓపెన్ టోర్నీ జరగనుంది రాత్రి 8:30 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. 

13.నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశం

 

నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశం జరుగనుంది.ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. 

14.శ్రీశైలం జలాశయం 10 గేట్ల ఎత్తివేత

 శ్రీశైలంలో వరద ప్రవాహం కొనసాగుతోంది.దీంతో జలాశయం లోని 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 

15.సోము వీర్రాజు సవాల్

 

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

వినాయక చవితి వేడుకలకు నిబంధనలు పెట్టడం ఏమిటని ,తాము ఎలాంటి అనుమతులు తీసుకోమని దమ్ముంటే అరెస్ట్ చేసుకోవాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. 

16.తెలుగు భాషా దినోత్సవం పై జగన్ కామెంట్స్

   వాడుక భాష ఉద్యమానికి  ఆధ్యులు ,బహుముఖ ప్రజ్ఞాశాతి గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవం గా జరుపుకోవడం ఎంతో గర్వకారణం అని ఏపీ సీఎం జగన్ అన్నారు. 

17.ఏపీ వ్యాప్తంగా నిరసనలకు బిజెపి పిలుపు

 

Advertisement

నేడు వ్యాప్తంగా నిరసనలకు బిజెపి పిలుపు ఇచ్చింది .గణేష్ మండపాల సంఖ్య కుదింపు పై నిరసనలు చేయనున్నారు. 

18.మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడిస్తాం

  తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టిన వీఆర్ఏలు తమ మరింత ఉధృతం చేసేందుకు సెప్టెంబర్ ఒకటి నుంచి మంత్రులు ,ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్ళ ముట్టడికి పిలుపు నిచ్చింది. 

19.విశాఖలో శునకాల రక్తం సేకరణ

 

ప్రాణాపాయం లో ఉన్న శునకాలకు రక్తాన్ని ఎక్కించేందుకు విశాఖలో శునకాల రక్త సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 47,150   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 51,430.

తాజా వార్తలు