న్యూస్ రౌండప్ టాప్ 20

1.జై తెలంగాణ అనడానికి కేసీఆర్ సిగ్గుపడ్డారు

 

Elangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

టిఆర్ఎస్ ఆవిర్భావ సభలో జై తెలంగాణ అనేందుకు సీఎం కేసీఆర్ సిగ్గుపడ్డారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు.

 

2.జీవి రెడ్డి పిటిషన్ పై హైకోర్టు విచారణ

  టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి పిటిషన్ పై హైకోర్టు లో విచారణ జరిగింది.5 వ ఫైనాన్స్ కమిషన్ ను నియమించకుండా నిధులు మళ్లిస్తున్నారు అని హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. 

3.విశాఖలో సీపీఐ నిరసన

 

Elangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

విద్యుత్ చార్జీల పెంపు స్మార్ట్ మీటర్ల బిగింపును వ్యతిరేకిస్తూ విశాఖపట్నంలో సిపిఐ నిరసనకు దిగింది .గురుద్వారా జంక్షన్ నుంచి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. 

4.కేసిఆర్ పై బండి సంజయ్ కామెంట్స్

 

Elangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

ఖమ్మం జిల్లాలో నిన్న సీఎం కేసీఆర్ బీ ఆర్ ఎస్ ఆవిర్భావ సభలో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్ చేశారు.ఖమ్మంలో కేసీఆర్ సభకు కుమారస్వామి,  నితీష్ కుమార్ రాలేదని ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇంకా మళ్ళీ రారని విమర్శించారు. 

5.దేవినేని ఉమా కామెంట్స్

 సీఎం జగన్ కళ్ళల్లో ఆనందం చూడడానికి పోలీసులు టిడిపి కార్యాలయాన్ని కూల్చడం వంటి పనులు చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. 

6.జగన్ మళ్లీ సీఎం అవుతారు

  రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని,  జగన్ మళ్ళీ సీఎం అవుతారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 

7.హైదరాబాదులో రెండో రోజు ఐటీ సోదాలు

  హైదరాబాద్ లో రెండో రోజు ఐటి సోదాలు కొనసాగుతున్నాయి .శ్రీ ఆదిత్య, ఉర్జిత్, సీస్కెఐరా రియల్ ఎస్టేట్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

8.తిరుమల సమాచారం

 

Advertisement

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.నేడు శ్రీవారి దర్శనం కోసం 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 

9.ఆరు ప్రత్యేక రైళ్ల పొడగింపు

  ప్రయాణికుల రద్దీ మేరకు వేరువేరు ప్రాంతాల నుంచి నడుస్తున్న ఆరు ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 

10.పిడిఎస్ యూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

 పిడిఎస్ యూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈనెల 21న హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. 

11.గ్రూప్ 2 ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

 

783 పోస్టుల భర్తీకి సంబంధించిన గ్రూప్ 2 ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయ్యింది.ఫిబ్రవరి 16 సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు గడువు ఉంది. 

12.గ్రూప్ వన్ మెయిన్స్ కొత్త నమూనాకు ఆమోదం

  గ్రూప్ వన్ మెయిన్స్ కు సంబంధించిన కొత్త నమూనాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆమోదించింది. 

13.నటి రాఖీసావంత్ అరెస్ట్

 

మోడల్ బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.నటి షెర్లిన్ చోప్రా ఫిర్యాదుతో రాఖీసావంత్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

14.గవర్నర్ ను కలిసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు

  ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ ను కలిశారు.రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. 

15.భారత రెజర్ల ధర్నా

  భారత రెజ్లర్లు ఆందోళన బాట పట్టారు.రీజనింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రీజ్ భూషణ్ లైంగికలకు పాల్పడుతున్నారని రెజలర్లు ఆరోపిస్తున్నారు. 

16.బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్

 

బీఆర్ఎస్ సభ అట్టర్ ప్లాప్ అన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పువ్వాడ అజయ్ కౌంటర్ ఇచ్చారు.బండి సంజయ్ కంటి వెలుగు కార్యక్రమంలో కళ్లద్దాలు తీసుకుని పెట్టుకుని చూడాలని ఎద్దేవా చేశారు. 

17.అయ్యన్న వ్యాఖ్యలపై పోలీస్ అధికారుల సంఘం అభ్యంతరం

  పోలీసుల్ని బెదిరించేలా రాజకీయ నేతలు వ్యాఖ్యలు చేయడం తగదని,  టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పోలీసుల పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం వ్యాఖ్యానించింది. 

18.రేషన్ కార్డు పై రాగులు,జొన్నలు పంపిణీ

 

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

త్వరలోనే ఏపీలో తెల్ల రేషన్ కార్డు దారులకు రాగులు, జొన్నలు పంపిణీ చేయనున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు తెలిపారు. 

19.కామారెడ్డి లో కొనసాగుతున్న ఆందోళనలు

 కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దుపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. 

20.ఈ రోజు బంగారం ధరలు

 

Advertisement

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 52,000   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 56,730        .

తాజా వార్తలు