న్యూస్ రౌండప్ టాప్ 20

1.అమరావతి కేసు పై సుప్రీం లో విచారణ

ఏపీ రాజధాని అమరావతి కేసు పై ఈనెల 23 న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

అమరావతి కేసును త్వరగా విచారించాలని ఈరోజు ఉదయం సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

2.ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగుల డెడ్ లైన్

ఈనెల 26 లోపు సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని , ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వైసిపి ప్రభుత్వంకు డెడ్ లైన్ విధించారు.

3.కేంద్రంపై హరీష్ రావు విమర్శలు

తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సమయంలో కేంద్రం తీరుపై మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు.తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని , రాష్ట్ర రుణం పరిధిని కేంద్రం తగ్గించిందని హరీష్ రావు మండిపడ్డారు.

4.కెసిఆర్ పై షర్మిల కామెంట్స్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల విమర్శలు చేశారు.శ్రీరామ్ సాగర్ నీళ్లు కేసీఆర్ సొంత ఆస్తిగా ఫీల్ అవుతున్నారని షర్మిల మండిపడ్డారు.

5.ప్రధానికి స్టాలిన్ లేఖ

తడిసిన దాన్ని కొనుగోలపై కేంద్ర ప్రభుత్వం నిబంధన సడలించి కావేరి డెల్టా రైతులను ఆదుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లేఖ రాశారు.

6.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

7.మెట్రోను పొడగించాలి

Advertisement

మియాపూర్ వరకు ఉన్న మెట్రో రైలు సంగారెడ్డి,  రాంనగర్,  సదాశివపేట ఎంఆర్ఎఫ్ పరిశ్రమ వరకు పొడిగించాలని టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

8.వర్గీకరణ పై  రహదారి దిగ్బంధం

 ఈ నెల 13న వర్గీకరణ సాధన ఎజెండాగా హైదరాబాద్ , విజయవాడ రహదారి దిగ్భంగం చేయనున్నట్లు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు.

9.ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్స్ డే

టీఎస్ ఆర్టీసీకి బడ్జెట్లో రెండు శాతం నిధులు కేటాయించడంతో పాటు , మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన పిఆర్సి హామీలను అమలు చేయాలన్న డిమాండ్ తో ఈనెల 7న రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్స్ పాటించాలని నిర్ణయించినట్లు ఆర్టిసి జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి తెలిపారు.

10.కేంద్ర బడ్జెట్ తెలంగాణ గవర్నర్ స్పందన

ఆర్థిక అభివృద్ధి కోసం దూరదృష్టితో 2023 - 24 బడ్జెట్ ను రూపొందించారని తెలంగాణ గవర్నర్  తమిళ సై సౌందర్య రాజన్ అన్నారు.

11.కాసాని జ్ఞానేశ్వర్ కు చంద్రబాబు పరామర్శ

తెలంగాణ టిడిపి అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ను టిడిపి అధినేత చంద్రబాబు పరామర్శించారు.కొద్దిరోజుల క్రితం కాసాన్ని జ్ఞానేశ్వర్ తల్లి కౌసల్య మృతి చెందడం తో చంద్రబాబు  పరామర్శ కి వెళ్ళారు.

12.ఉత్తంకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీ ఈనెల ఆఖరికి రద్దవుతుందని,  వెంటనే రాష్ట్రపతి పాలన విధిస్తారని కాంగ్రెస్ నల్గొండ ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

13.రేవంత్ పాదయాత్రకు రమ్మన్నారు : విహెచ్

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫోన్ చేసి తనను పాదయాత్రకి రమ్మన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి .హనుమంతరావు తెలిపారు.

14.బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు

తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

15.బీఆర్ఎస్ ప్రభుత్వం పై ఈటెల ఫైర్

త్వరలో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా.. ఆ వివాదంపై జానీ మాస్టర్ క్లారిటీ ఇదే!
కిరణ్ అబ్బవరంకు పరోక్షంగా అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పారా.. అసలేం జరిగిందంటే?

తెలంగాణ అధికార పార్టీ ఆగడాలు శృతిమించాయని, ఈ అరాచకాలు ఎక్కువ రోజులు చెల్లవు అని బిజెపి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.

16.ఎమ్మెల్యేల కొనుగోలు కేసు .సిబిఐ విచారణకు అనుమతి

తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పై  సిబిఐ విచారణకు హైకోర్టు అనుమతించింది.

17.రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం

Advertisement

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నుంచి ప్రారంభమైంది.

18.విశాఖకు మాజీ ఉపరాష్ట్రపతి రాక

విశాఖలో మూడు రోజుల పర్యటన కోసం నేడు నగరానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రానున్నారు.

19.బాబా రాందేవ్ పై కేసు

ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు చేసిన ప్రముఖ యోగ గురువు బాబా రాందేవ్ పై కేసు నమోదు అయింది.రాజస్థాన్ లోని బార్మర్ లో జరిగిన కార్యక్రమంలో రాందేవ్ బాబా ముస్లింలపై ఉద్వేశపూరిత వ్యాఖ్యలు చేశారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 52,650 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 57,440.

తాజా వార్తలు