న్యూస్ రౌండప్ టాప్ 20 

1.తెలంగాణకు వర్ష సూచన

  రాబోయే మూడు రోజుల అటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు.

 

2.బస్తి లో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు

 హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.అర్ధరాత్రి గేమ్స్ పేరుతో రోడ్లపై యువత కృషి చేస్తున్న క్రమంలో ప్రతి ఒకటి నుంచి మూడు వరకు పోలీసులు దాడి చేపట్టారు. 

3.హరీష్ రావు పర్యటన

  ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. 

4.అండమాన్ దీవుల్లో భూకంపం

 

అండమాన్ దీవుల్లో భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పై 4.4 గా దీని తీవ్రత నమోదు అయ్యింది. 

5.కోల్ కతా ఐజీఎం లో పోస్టుల భర్తీ

 సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్  కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇండియా కు చెందిన కోల్కతా లోని ఇండియన్ గవర్నమెంట్ మింట్ లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఏడు ఖాళీలను భర్తీ చేయనున్నారు. 

6.ఆదిలాబాద్ జిల్లా రైతుల నిరసన

  హైదరాబాద్ లోని వ్యవసాయ కమిషనరేట్ ముందు హైదరాబాద్ రైతులు నిరసనకు దిగారు.ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన లో ప్రభుత్వం వాటా నిధులను చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. 

7.జేపీ నడ్డా కాదు.అబద్ధాలకు అడ్డా : హరీష్

 

Advertisement

కాంగ్రెస్ బిజెపిల పై మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు.బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ను ఉద్దేశించి జేపీ నడ్డా కాదు.అబద్ధాలకు అడ్డా అంటూ హరీష్ రావు విమర్శలు చేశారు. 

8.ల్యాండ్ పూలింగ్ బాధిత రైతుల ఆందోళ

న   వరంగల్ కార్పొరేషన్ లో ల్యాండ్ పూలింగ్ బాధిత రైతులు ఆందోళనకు దిగారు.గ్రీవెన్స్ సెల్ లో కమిషనర్ ప్రావీణ్యంతో వాగ్వాదానికి దిగారు. 

9.గీత ఆర్ట్స్ కార్యాలయం ముందు మహిళా ఆర్టిస్ట్ నిరసన

  గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు మహిళా ఆర్టిస్ట్ అర్ధ నగ్నంగా నిరసనకు దిగారు.గీతా ఆర్ట్స్ వారు తణుకు డబ్బులు చెల్లించాల్సి ఉన్నందునే ఈ నిరసనకు దిగినట్లు  సమాచారం. 

10.జిహెచ్ఎంసి కార్యాలయం ముట్టడికి ప్రయత్నం

  హైదరాబాదులోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముట్టడికి పారిశుద్ధ్య కార్మికులు ప్రయత్నించారు.కార్మికుల బయోమెట్రిక్ విధానం రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. 

11.జనసేన పై సోము వీర్రాజు కామెంట్స్

 

తాము జనంతోనే జనసేన తోనే ఉన్నామని ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. 

12.సీపీఐ కార్యకర్తలు అరెస్ట్

 విజయవాడలోని సిపిఐ కార్యాలయం నుంచి సెక్రటరియేట్ కు నేతలు, కార్యకర్తలు బయలుదేరిన క్రమంలో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. 

13.పొత్తుల విషయం పై కాంగ్రెస్ విమర్శలు

 

పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. 

14.రోడ్ల పరిస్థితి పై బీజేపీ విమర్శలు

 జగనన్న రహదారులు గుంతల పథకం పెట్టినట్లు ఉందని  బిజెపి నేత లంక దినకరన్ ఏపీ లో రోడ్ల పరిస్థితి పై కామెంట్ చేశారు. 

15.టీడీపీ పై మంత్రి జోగి రమేష్ విమర్శలు

 

ఏపీలో వైసిపి ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం తెలుగుదేశం పార్టీకి లేదని ఏపీ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. 

16.పేలిన ఎలక్ట్రిక్ బైక్

  వరుసగా ఎలక్ట్రిక్ బైక్ లు పేలుతున్న ఘటనలు ఆందోళన  కలిగిస్తున్నాయి.తాజాగా కరీం నగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రాపూర్ లో ఎలక్ట్రిక్ బైక్ పేలిన ఘటనలో బైక్ దగ్ధం అయ్యింది. 

17.విజయవాడ పోలీసుల ప్రత్యేక డ్రైవ్

అసాంఘిక కార్యకలాపాలు పై విజయవాడ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్న 15 ప్రాంతాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. 

18.అవసరం లేకున్నా ఆపరేషన్స్ చేస్తున్నారు

 ప్రైవేటు ఆసుపత్రులలో అవసరం లేకుండా ఆపరేషన్ చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని మంత్రి హరీశ్ రావు అన్నారు. 

19.ఏపీకి తుఫాను ముప్పు లేదు

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?

 ఏపీకి అసానీ తుఫాను ముప్పు లేదని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 

20.ఈ రోజు బంగారం ధరలు

Advertisement

 

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,500

 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 51,810           .

తాజా వార్తలు