రజినీకాంత్ జైలర్ లో మరో స్టార్..!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమాకు జైలర్ టైటిల్ ని ఫిక్స్ చేశారు.

రజినీ మార్క్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ వస్తుందని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో రజినీతో పాటుగా మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది.సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారని తెలుస్తుంది.

రజినీకాంత్ సినిమాలో శివ రాజ్ కుమార్ నటిస్తున్నాడని తెలియగానే ఈ మూవీపై అంచనాలు పెరిగాయి.ఇక జైలర్ టైటిల్ పోస్టర్ లో కత్తి చూపించి అంచనాలు పెంచాడు డైరక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.

నెల్సన్ దిలీప్ కుమార్ కథకు ఇంప్రెస్ అయిన రజినీ ఈ మూవీతో పక్కా హిట్ కొట్టాలని టార్గెట్ పెట్టుకున్నారు.తన మార్క్ హిట్ కొట్టి చాలా రోజులు అవుతున్న కారణంగా రజినీ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.

Advertisement

అందుకే నెల్సన్ డైరక్షన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా జైలర్ చేస్తున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్.ఈ సినిమాకు అనిరుధ్ రవి చందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021
Advertisement

తాజా వార్తలు