ఇక యాడ్స్ పై పూర్తిగా మన పెత్తనమే..!

ఇప్పటికే ఆండ్రాయిడ్ ఫోన్స్​లో కాల్​ రికార్డింగ్ యాప్స్‌ను తొలగించనున్నట్టు ప్రకటించిన గూగుల్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై యాడ్స్ ని మనమే నియంత్రించేలా ఓ కొత్త ఆప్సన్ ను తేనుంది.

 And We Are Completely In Control Of The Ads , Google Adds, Advertisement, Settin-TeluguStop.com

మనం మన ఫోన్ లో యూట్యూబ్ లో కానీ, ఫేస్ బుక్ లో కానీ వీడియోలు చూస్తుంటే దానికి సంబందించిన యాడ్స్ కుప్పలు తెప్పలుగా ప్రత్యక్షమవుతుంటాయి.అంతలా ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ మనల్ని, మన అభిరుచుల్ని ఫాలో అవుతుందన్నమాట.

అయితే, ఆన్‌లైన్‌ యాడ్స్‌ను నియంత్రించటానికి తాజాగా కొత్త ఫీచర్‌ను తీసుకు వస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించింది.

తాజాగా గూగుల్‌ ఓ కీలక ప్రకటన చేసింది.

యాడ్స్‌ను మనమే నియంత్రించుకునేలా ‘మై యాడ్‌ సెంటర్‌‘ అనే ఫీచర్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది.దీంతో యూజర్లు తాము చూడాలనుకున్న యాడ్స్‌ను తామే సెలక్ట్‌ చేసుకోవచ్చు.ఈ ఫీచర్‌ ఏడాది చివరి నాటికి యూజర్లకు అందుబాటులోకి వస్తుందని గూగుల్‌ వెల్లడించింది.‘మై యాడ్‌ సెంటర్‌’లో యూజర్లు గతంలో ఎక్కువగా వెతికిన బ్రాండ్ల పేర్లను మాత్రమే చూపిస్తుంది.ఇవి కూడా కేటగిరిల వారీగా ఉంటాయి.వీటిలో యూజర్లకు ఇష్టమైన కేటగిరిని సెలెక్ట్‌ చేసుకొని యాడ్స్‌ను ఆస్వాదించవచ్చు.అంతేకాకుండా ‘పర్సనలైజ్‌డ్‌ యాడ్స్’ను టర్న్‌ ఆఫ్‌ చేసుకునే సదుపాయం ఉంటుంది.

మై యాడ్‌ సెంటర్‌లో ఇటీవల మనం చూసిన యాడ్స్‌ను చూడటానికి ‘హోమ్‌ ట్యాబ్‌’లో మోస్ట్‌ రీసెంట్‌ ఆప్షన్‌ ఉంటుంది.

ప్రైవసీలో మన వ్యక్తిగత సమాచారాన్ని యాడ్‌/ఎడిట్‌ చేసుకోవచ్చు.మెనూలో బ్రాండ్‌, టాపిక్, సెన్సిటీవ్‌ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి.టాపిక్‌ ట్యాబ్‌లో మనకు కావాల్సిన, ఆసక్తి ఉన్న వాటి సమాచారాన్ని సెలెక్ట్‌ చేసుకోవచ్చు.బ్రాండ్‌లో మనకు ఇష్టమైన బ్రాండ్ల పేర్లను ఎంచుకోవచ్చు.

యాడ్స్‌ను కంట్రోల్‌ చేయడంతోపాటు ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వటానికి లైక్‌, బ్లాక్‌, రిపోర్ట్‌ వంటి ఆప్షన్స్‌ కూడా ఉంటాయి.దీనికి సంబంధించి సరైన స్పష్టత రావాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube