విజయ్ తో వివాదంపై తొలిసారి స్పందించిన అనసూయ.. ఇకపై ఆపేద్దామనుకుంటున్నానంటూ?

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) నటి యాంకర్ అనసూయ భరద్వాజ్( Anchor Anasuya Bhardwaj ) ల మధ్య గత కొంతకాలంగా వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.

వీరిద్దరి మధ్య వార్ ఎప్పటినుంచో అలాగే కొనసాగుతూనే ఉంది.

అనసూయ ఇన్ డైరెక్ట్ గా విజయని ఉద్దేశించి సోషల్ మీడియాలో ట్వీట్లు చేయడం ఆ ట్వీట్ పై విజయ్ అభిమానులు మండిపడుతూ ఆమెపై ట్రోల్స్ చేయడం ఇవన్నీ కావడం అయిపోయాయి.ఇది ఇలా ఉంటే మొట్టమొదటిసారి అనసూయ విజయ్ దేవరకొండ వివాదం పై స్పందించింది.

ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ.విజయ్‌ దేవరకొండ నాకు ఎంతో కాలం నుంచి పరిచయం.మేమిద్దరం మంచి స్నేహితులం.

Advertisement

ఆయన హీరోగా నటించిన అర్జున్‌రెడ్డి ( Arjun Reddy )మూవీలో అభ్యంతరకర పదాలను మ్యూట్‌ చేసిన విషయం తెలిసిందే.అయితే, ఆ సినిమా విడుదలైనప్పుడు థియేటర్‌ విజిట్‌కు వెళ్లిన విజయ్ అక్కడున్న అభిమానులతో ఆ పదాలను పలికించారు.

ఒక తల్లిగా అది నన్నెంతో బాధించింది.ఇలాంటివి ప్రోత్సహించవద్దని ఆయనతో చెప్పాను.

ఆ తర్వాత నాపై ఆన్‌లైన్‌ ట్రోల్స్‌ మొదలయ్యాయి.ధైర్యంగా ఆ బాధ నుంచి బయటకు వచ్చిన నేను మీకు మాత్రమే చెప్తా సినిమాలో నటించాను.

విజయ్‌కు సంబంధించిన ఒక వ్యక్తి నన్ను ట్రోల్‌ చేయడం కోసం పలువురికి డబ్బులు ఇస్తున్నాడని తెలిసి షాక్‌ అయ్యాను.విజయ్‌కు తెలియకుండానే ఇది జరుగుతోందా? అనిపించింది.విజయ్‌ నన్ను ద్వేషిస్తున్నాడో, లేదో నాకు తెలియదు.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!

కానీ, ఇక్కడితో దీన్ని ఆపేయాలని, ముందుకు సాగిపోవాలని నిర్ణయించుకున్నాను.ఎందుకంటే నాకుమానసిక ప్రశాంతత కావాలి అని చెప్పుకొచ్చింది అనసూయ.

Advertisement

అనసూయ విషయానికి వస్తే ప్రస్తుతం అనసూయ తెలుగులో వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా అవకాశాలను అందుకుంటూ క్షణం కూడా క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది.

తాజా వార్తలు