సాధారణంగా, ప్రజలు తమ వెడ్డింగ్ డ్రెస్సులను( Wedding Dress ) ఒక్కసారి మాత్రమే ధరిస్తారు.ఒక్కసారి ధరించే వీటి కోసం చాలా ఎక్కువ డబ్బులు పెడతారు.
పెళ్లి వేడుకలు ముగిసిన తర్వాత ఆ డ్రెస్‌ను పక్కన పడేస్తారు.అయితే ఈ అలవాటుకు ముగింపు పలకాలని యూఎస్ మగువలు చెప్పకనే చెబుతున్నారు.
ఇటీవల అలెక్సిస్ ( Alexis ) అనే మహిళ తన ఐదుగురు సిస్టర్స్, తల్లితో పాటు ఒక డిన్నర్ పార్టీకి హాజరయ్యింది.అయితే వీరందరూ కూడా తమ తమ ఖరీదైన వెడ్డింగ్ డ్రెస్సులలో డిన్నర్ పార్టీకి వచ్చారు.
దాంతో అవాక్కవ్వడం అందరి వంతయింది.వీరందరూ పెళ్లికూతుర్ల లాగా తయారయ్యి రావడం చూసి మిగతావారు వీడియో తీసి సోషల్ మీడియాలో( Social Media ) షేర్ చేశారు.ఆ వీడియోలు ఇంటర్నెట్లో విస్తృతంగా చక్కర్లు కొట్టాయి.ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఇది చాలా ప్రత్యేకమైన మెమరీగా వారి జీవితంలో నిలుస్తుందని కామెంట్లు చేశారు.ఎంతో ఖర్చు పెట్టి కొనుగోలు చేసే డ్రెస్సులను ఇంట్లో ఏదో ఒక మూలన మురగబెట్టడం కంటే ఇలా వాడటం మంచి ఐడియా అని మరికొందరు పొగిడారు
అలెక్సిస్ కూడా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.దీనికి మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.చాలా మంది వ్యక్తులు ఈ ఆలోచనను ఇష్టపడ్డారు.వారు ప్రతి సంవత్సరం ఇలానే పెళ్లి బట్టలను వేసుకొని వాటిని వాడాలని అన్నారు.కాగా ఈ ఆడవారికి పెళ్లి బట్టలు ఇప్పటికీ సరిగ్గా సరిపోవడాన్ని గమనించి కొందరు నెటిజన్లు ఆశ్చర్యపోయారు.ప్రతి సంవత్సరం తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వెడ్డింగ్ డ్రెస్సులను తాము కూడా ధరిస్తామని ఇంకొందరు తమ సొంత విశేషాలను పంచుకున్నారు.