అనసూయ టాటూ సీక్రెట్స్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

టాలీవుడ్ బుల్లితెర యాంకర్ అనసూయ గురించి తెలియని వారెవ్వరూ లేరని చెప్పవచ్చు.ఎందుకంటే ఈ బ్యూటీ రేంజ్ ప్రస్తుతం అందనంత ఎత్తులో ఉంది.

అంతేకాకుండా వెండితెరపై కూడా ఎన్నో ఆఫర్లతో దూసుకుపోతుంది.ఇక బుల్లితెరలో జబర్దస్త్ షోలో తన అందంతో యువతను బాగా ఆకట్టుకుంటుంది.

బుల్లితెరలో, వెండితెర లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన హవా అన్నట్లు జోరుగా సాగుతుంది.తన హాట్ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.

ఇక ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్ లలో తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడమే కాకుండా.కొన్ని వర్క్ అవుట్ ల వీడియోలను, కొన్ని సోషల్ యాక్టివిటీస్ కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంది.

Advertisement

తాజాగా అనసూయ తన టాటూ సీక్రెట్ గురించి కొన్ని విషయాలు బయట పెట్టింది.

అనసూయకు ఎదపై , చేతిపై టాటూ లు ఉన్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే ఆమె తన అభిమానులతో 30 క్వశ్చన్ విత్ అనసూయ అనే వీడియో చేస్తూ అందులో అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది.అంతేకాకుండా తన టాటూ సీక్రెట్ గురించి కూడా కొన్ని విషయాలు తెలిపింది.

తన ఎద పై ఉన్న టాటూ ఆమె భర్త శశాంక్ భరద్వాజ్ ముద్దు పేరు అయినా నీకు అని రాసి ఉంది.ఈ టాటూను వాళ్ల ఎంగేజ్మెంట్ అయ్యాక.

తమ పెళ్లికి కి సంవత్సరన్నర సమయం పట్టగా.దీంతో ఎంగేజ్మెంట్ యానివర్సరీ రోజు గుర్తుండి పోయేలా టాటూ వేయించుకున్నానని తెలిపింది.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?

ఇక తన చేతి మీద ఉన్న టాటూ కేలర్ అంటూ.దాని అర్థం బాహ్య సౌందర్యం కన్నా అంతః సౌందర్యానికి విలువనివ్వడం అని తెలిపింది.

Advertisement

ఇది కాక త్వరలోనే మరో టాటూ వేయించుకుంటానని తెలిపింది అనసూయ.

తాజా వార్తలు