మోడీని ఆకాశానికెత్తేసిన అమెరికన్ మీడియా.. ఎందులో చూసినా ‘నమో’ గురించే

భారత ప్రధాని నరేంద్ర మోడీపై అమెరికన్ మీడియా ప్రశంసల వర్షం కురిపించింది.

ఉక్రెయిన్ యుద్ధానికి ఇది సమయం కాదంటూ ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సూచించిన నేపథ్యంలో మోడీని అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆకాశానికెత్తేస్తోంది.

ఎస్సీవో సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌ఖండ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా రష్యా అధినేత పుతిన్‌తో మోడీ భేటీ అయ్యారు.

ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌పై యుద్ధానికి ముగింపు పలకాల్సిందిగా పుతిన్‌ను ఆయన కోరారు.ప్రస్తుత యుగం యుద్ధాలది కాదని సూచించారు.

మోడీ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన పుతిన్, వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగించేందుకు ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు.దీనిని టార్గెట్ చేసిన అమెరికన్ మీడియా.

Advertisement

దానికి మరింత మసాలా జోడించి కథనాలను వండి వార్చింది.ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్‌ను మోడీ మందలించారని వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది.

ఈ క్రమంలోనే పుతిన్ అన్ని వైపుల నుంచి ఒత్తిడికి లోనవుతున్నట్లు తన కథనంలో పేర్కొంది.ఇక మరో ప్రధాన వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్ కూడా ఇలాగే స్పందించింది.

ఇప్పుడు యుద్ధాల యుగం కాదని.పుతిన్‌కు భారత నాయకుడు చెప్పారని ప్రచురించింది.

ఇద్దరు నేతలు తమ సుదీర్ఘ స్నేహ సంబంధాల చరిత్రను ప్రస్తావించారని, ఉక్రెయిన్‌లో యుద్ధం గురించి భారత్ ఆందోళనలను తాము అర్ధం చేసుకున్నట్లు మోడీతో పుతిన్ అన్నట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.ఇక పుతిన్‌తో చర్చల సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌‌పింగ్ కనీసం ఉక్రెయిన్ ప్రస్తావన తీసుకురాలేదని అమెరికన్ మీడియా మండిపడింది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

ఇకపోతే.రెండు రోజుల పాటు జరిగే ఎస్సీవో సదస్సులో ప్రాంతీయ భద్రతా సవాళ్లు, వ్యాపార వాణిజ్యం, ఇంధన సరఫరా పెంపు, ఉగ్రవాదం తదితర అంశాలపై కూటమి సభ్యదేశాల అధినేతలు చర్చిస్తారు.ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతల వేళ ఈ సదస్సును అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది.

Advertisement

తాజా వార్తలు