ట్రోల్స్‌ : ఇతరులని కాపీ కొట్టడం మానేసి నిన్ను నీవే కాపీ కొట్టుకుంటున్నావా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఒకప్పుడు టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌గా పేరు దక్కించుకున్నాడు.ఇప్పటికి కూడా ఆయన్ను టాప్‌ డైరెక్టర్‌ అంటూ ఆయన అభిమానులు అనుకుంటున్నారు.

ఒకప్పుడు క్రియేటివ్‌ కంటెంట్‌తో మెప్పించిన దర్శకుడు త్రివిక్రమ్‌ ఇప్పుడు మాత్రం కాపీ క్యాట్‌ అంటూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.అఆ నుండి మొదలుకుని మొన్నటి అజ్ఞాతవాసి అరవింద సమేత వరకు అన్ని కూడా కాపీ సినిమాలే.

అజ్ఞాతవాసి సినిమాను ఒక హాలీవుడ్‌ సినిమా ను ఉన్నది ఉన్నట్లుగా దించేశాడు.

ఇప్పుడు అల వైకుంఠపురంలో సినిమాను త్రివిక్రమ్‌ చేస్తున్నాడు.ఈ సినిమా టీజర్‌ నిన్న విడుదల అయ్యింది.టీజర్‌కు 7 నిమిషాల్లోనే మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి.

Advertisement

ఇది అద్బుతమైన రికార్డ్‌.దీన్ని మామూలుగా ప్రేక్షకులు చూడలేదు.

జనాలు బాగా చూసిన ఈ టీజర్‌ ఇప్పుడు సినిమాపై విమర్శలు వచ్చేలా చేస్తుంది.టీజర్‌లోని పలు షాట్స్‌ అజ్ఞాతవాసి మరియు అత్తారింటికి దారేది సీన్స్‌ను తలపిస్తున్నాయి.

టీజర్‌లో ఉన్న సీన్స్‌ను చూసిన తర్వాత జనాలు ఇన్ని రోజులు ఇతర సినిమాలను కాపీ కొట్టిన త్రివిక్రమ్‌ ఇప్పుడు తన సినిమాలను తానే కాపీ కొట్టాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ కూడా ఈ విషయమై కాస్త ఆగ్రహంతోనే ఉన్నారు.అత్తారింటికి దారేది మరియు అజ్ఞాతవాసిని కలిపి మిక్సీలో వేస్తే వచ్చిందే అల వైకుంఠపురంలో సినిమా అంటూ వారు కామెంట్స్‌ చేస్తున్నారు.

మరి సినిమా ఎలా ఉంటుంది అనేది సంక్రాంతికి విడుదల అయితే కాని తెలియదు.

నేను ధనవంతురాలిని కాదు....నా దగ్గర సహాయం చేసేంత డబ్బు ఉంది : సాయి పల్లవి
Advertisement

తాజా వార్తలు