కాంగ్రెస్ తో వామపక్ష పార్టీల పొత్తు ! పంపకాల వద్దే పేచీ

తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్( Brs ) తో పొత్తు పెట్టుకునేందుకు వామపక్ష పార్టీలు చాలానే ప్రయత్నాలు చేశాయి.

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ , వామపక్ష పార్టీల మధ్య పొత్తు కుదరడంతో,  ఆ పొత్తును అసెంబ్లీ ఎన్నికల వరకు కేసీఆర్ కొనసాగిస్తారని ఆ రెండు పార్టీల నేతలు ఆశలు పెట్టుకున్నా,  కేసీఆర్ మాత్రం సిపిఐ,( CPI )  సిపిఎం పార్టీలతో పొత్తు కొనసాగించేందుకు ఆసక్తి చూపించలేదు.

పోనీ ఒంటరిగా పోటీ చేద్దామన్నా, అంతటి శక్తి సామర్థ్యాలు లేకపోవడంతో , తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పొత్తు కోసం వామపక్ష పార్టీల నేతలు ప్రయత్నాలు చేసి దాదాపుగా సక్సెస్ అయ్యారు.ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ కూడా అంగీకరించింది.

దాదాపు పొత్తు కూడా ఖరారు అయింది.ఏఐసీసీ నేతృత్వంలో జాతీయ స్థాయిలో ఏర్పడిన ఇండియా కూటమిలో వామపక్ష పార్టీలు భాగస్వాములుగా ఉండడంతో,  తెలంగాణలోని పార్టీలు కాంగ్రెస్ తో పొత్తుకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడలేదు.

కానీ సీట్ల పంపకాల విషయంలోనే ఏ క్లారిటీ రాలేదు.ఈ మధ్యనే తెలంగాణకు వచ్చిన ఏఐసిసి నేత కేసి వేణుగోపాల్( KC Venugopal ) ను సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పొత్తు, సీట్ల వ్యవహారంపై ఆయనతో చర్చించారు.

Advertisement

పొత్తుకు కాంగ్రెస్ అంగీకరించినప్పటికీ సీట్ల విషయంలో మాత్రం ఏ క్లారిటీ రావడం లేదు.కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా చెరో ఐదు స్థానాలను తమకు కేటాయించాలని సిపిఐ, సిపిఎం లు కాంగ్రెస్ ను కోరుతున్నాయి.

కొత్తగూడెం,  వైరా, హుస్నాబాద్, బెల్లంపల్లి, మునుగోడు స్థానాలను తమకు కేటాయించాల్సిందిగా సిపిఐ నేత నారాయణ కోరుతున్నారు.భద్రాచలం, పాలేరు, మిర్యాలగూడ,  మధిర, ఇబ్రహీంపట్నం కేటాయించాలని సిపిఎం కోరుతోంది.

అయితే వామపక్ష పార్టీలు కోరుతున్న స్థానాలన్నీ కాంగ్రెస్.కు పట్టున్న ప్రాంతాలు కావడంతో, సీట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ ఏ క్లారిటీకి రాలేకపోతోంది.

 ఇప్పటికే సీట్ల కేటాయింపు విషయమై కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు టాక్రే ( Telangana Incharge Manik Rao Takre )తో  సిపిఎం నేతలు ఫోన్ ద్వారా మాట్లాడారు .సీట్ల విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత పొత్తుల అంశంపై చర్చించాలని వామపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయి.సిపిఐ, సిపిఎంతో పొత్తు కు ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా , ఆ రెండు పార్టీలు కోరుతున్న స్థానాల్లో కాంగ్రెస్ ప్రముఖులతో పాటు , బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరబోతున్న నాయకులు ఆశలు పెట్టుకోవడంతో కాంగ్రెస్ డైలమాలో పడింది.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

ప్రస్తుతం ఈ మూడు పార్టీలకు వ్యాపారం పైనే జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు