15 వేల కోట్లు దాటనున్న లోక్ సభ ఎన్నికల వ్యయం!

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు సమీపించానున్నాయి.దేశంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఎవరికి వారు తమ రాజకీయ లక్ష్యాలతో ముందుకి సాగుతున్నారు.

ఇక పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ అధినేత రాహుల్ తనదైన శైలితో చాలా స్పీడ్ గా దూసుకుపోతున్నాడు.ఇక ప్రధాని మోడీ మళ్ళీ తాము అధికారంలోకి వస్తామని బలంగా విశ్వసిస్తున్నాడు.

ఇదిలా వుంటే మరో వైపు ప్రాంతీయ పార్టీలు సైతం లోక్ సభ బరిలో సత్తా చూపించి కేంద్రంలో చక్రం తిప్పాలని లక్ష్యంగా పని చేస్తున్నాయి.ఈ నేపధ్యంలో అసలే దేశంలో ఎన్నికలు అంటే డబ్బుతో వ్యవహారం.

ఇప్పటికే మన పార్లమెంట్ ఎన్నికల వ్యయం ఈ సారి ప్రపంచ రికార్డ్ సాధిస్తుంది అనే వార్తలు కూడా వచ్చాయి.ఈ నేపధ్యంలో అసోచామ్ అనే సంస్థ భారత్ లో పార్లమెంట్ ఎన్నికల ఖర్చు ఎంత అయ్యే అవకాశం వుంది అనే విషయంలో అంచనా వేసింది.

Advertisement

సుమారు 15 వేల కోట్లు దాటి ఎన్నికల ఖర్చు ఈ సారి పార్లమెంట్ ఎన్నికలలో అయ్యే అవకాశం ఉందని తెలియజేసింది.ఇక్కో నియోజక వర్గంలో అభ్యర్ధి తన గెలుపు కోసం ఆరు కోట్ల వరకు ఖర్చు చేయడానికి రెడీ అవుతున్నాడని, అలాగే ఒక్కో నియోజక వర్గం నుంచి ఇద్దరు నుంచి నలుగురు వరకు అభ్యర్ధులు ఉన్నారని, ఈ లెక్క ప్రకారం 13 వేల కోట్లు ఖర్చు అవుతుందని, మిగిలిన పార్టీలని కలిపితే 15 వేల కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఏపీలో కూటమి గెలుస్తుంది అంటూ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు